పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లయితిరో ఆ కారణములతోనే నన్నను వర్తింపుఁడు. నా మాటలు స్వతఃప్రమాణములు గాని పరతః ప్రమాణములు గావు. నన్ను, నా కార్యములను నాడి ననుసరించి విశ్వసింపవలదు" అనిరి.

అక్కడ నున్న శిష్యులు కొందఱు 'మీయా దేశముల ననువదించుట చేతనే నాడిని విశ్వసించుచుంటిమి. తద్విరుద్ధముగా నుండు నేని నను వర్తించుచున్నట్టే యుండి యీ నాడి కాలాంతరమున నజ్ఞానముచే తప్పులు చెప్పుట సాగింప వచ్చును. అందాఁక రచియించిన గ్రంధముపై ప్రామాణ్యము కల్పించుట మికు సంగతముగాఁ దోఁపకపోవచ్చును. నా యోగ మార్గమును బరిపూర్ణముగా గుర్తించుట యెవ్వరికిని సాధ్యము గాదు. అది నాకుఁగూడ నప్పటప్పట దెలియనగు నదిగా నుండును.  శాఖోపశాఖలుగాఁ బెరుగఁగల మఱ్ఱచెట్టు నకు ఎన్నాళ్ళ కేదిక్కున నే శాఖ నది వెలయింపఁ గలదో తెలియనట్టే లోకతంత్రమున వికాస ముండును. మానవుఁడు ఈశ్వరతను జేరబోవు కొలఁదిని దానిని దెలియఁగల్గవ వచ్చును. వృక్షశాస్త్రమునఁ గొన్ని వృక్షము లిన్నాళ్ళ కిన్ని యాకులనో, శాఖలనో వెలయింపఁగల వనీ,యీ యీ సమయములలో బుష్పింపఁ గలవనీ,ఫలింపఁ  గల వనీ, ఇన్ని పుష్పము లనీ, యిన్ని ఫలము లనీ కూడ గుర్తించుట జరగుచున్నది.మానవ ప్రజ్ఞ పెరుగను ఈశ్వరునకుఁ జేరువ కానుగాను సర్వ ప్రాణి సృష్టిరహస్యములను మానవుఁ డు గుర్తింప గల్గవచ్చును.