పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యములను వెల్ల డింపఁగలదు. అదిచదువుటకు సమయమున్నది. అప్పుడు దానిని చదువుదురు గాని" యని బదులు చెప్పిరఁ ట!అంతకుఁ బుర్వమే శ్రీవారి జాతకమునఁ గొంత భాగము చదువు టయ్యెను ఇతరుల జాతకములోను గొన్ని భాగములు చదువు టయ్యెను. ఆ కాలమున నేనును నాజాతకపుఁ బీఠికాభాగమును, జదివించుకొంటిని. ధ్రువనాడీని, భుజండనాడీ యవతరణికాభాగమును, విజయనగరపుఁబక్షి శాస్త్ర శ్లోకములను, శ్రీవారిని గూర్చి నేను వ్రాసియుంచు కొన్న పద్యములను వ్రాసి పెట్టుకొన్న వ్రాఁత ప్రతిని, ఇటాలియన్ నోటుబుక్కును ఎవ్వరో హరించిరి. అది నా దగ్గఱ నిపుడు లేదు. ఉన్నచో నాయా శ్లోకములను, అరవ పద్యములను, దెలుఁగు పద్యములను, చాల వింత విషయములు గల వాని నిక్కడ నుదాహరించి యుందును.