పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దానికి బదులు ననుగ్రహింపక యనన్వితముగా జరపిన సందర్భమునకు, మధ్యాహ్నము మరల వెంటాడి ముర్ఖతతో ప్రశ్నింపఁగా చూచినచూడ్కికి, చెప్పిన బదులుకు నే కాన్వయమును మఱి పదేండ్లకు గాని నేను గుర్తింప యోగ్యత గల వాఁడ గాఁజాల నయితిని. పదమూఁడేండ్లకు కద్భుతముగా తద్రహస్య మెల్ల ననుభూతి పూర్వకముగా గోచరించెను. అది యాసందర్భము వచ్చినప్పుడు వివరింపఁ గలను.

   కుంభకోణముణ నుండి యే మా తల్లిదండ్రులకు శ్రీవారు యా దేశమును వ్రాసితిని. శ్రీవారిసన్నిధిని మాదంపతుల కెట్టి యనుభూతులు జరగినచో సుదూర దేశమున నున్నను మా తల్లిదండ్రులకు నట్టియనుభూతులు జరిగినవి. తర్వాత వారు మద్రాసుకు నా కాయా విషయముల తెలిపిరి. నాఁడు రాత్రి మెయిలులో దంపతులము మేము మద్రాసు వచ్చి వేసితిమి.
                                         ----