పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

౩౦

నాడీగ్రంథములు

తంజావూరిలో పరిశీలించిన గ్రంధముల విషయమున జరపవలసిన తర్వాతి కార్యములను జరపుటకు మద్రాసులో మేము గొంత పని చేయవలసియుండుటచే మూఁడు నాల్గు నెలలు మేము మద్రాసులో నే యుంటిమి. అప్పుడు మద్రాసు గవర్నరుగా పెంట్లండు దొరగా రుండిరి. ఆయన నెవరో ఇంగ్లండు వారో, జర్మనీవారో ప్రేరేచి రఁట!' తంజావూరి విలువ కట్టుటకు గ్రంధముల పరిశీలనము జరుప వలసెను. మమ్మందుకు తంజావూరు పంపిరి.

ఈ రహస్యము పైకి పొక్కినది. ప్రజలు గందరగోళము చేసిరి. గవర్నరుగారు తమ తంత్రము కట్టిపెట్టిరి. ఒక విధముగా మే మక్కడికి వెళ్ళి జరపిన పరిశీలనము వ్యర్ధమయినది. కాని యానాఁడు మేము వ్రాసిన విమర్శములు గొన్ని యటుతర్వాత తంజావూరి కేటలాగులు ప్రకటించువా రుపయోగించుకొనిరి. మేము విలువ కట్టుట కేవలయు నంశములను బ్రధానముగాగూర్చితిమి. కాని గ్రంధాంశపర్యాలోచానకుఁ గాదు. కాన మా లిస్టులలో ఆ యావిషయములు పర్వాప్తముగా సేకరింప లేదు గాని పుస్తకముల నన్నింటిని సరిగా గుర్తించితిమి గణించితిమి. గవర్నరు గారిపనివ్యర్ధమయిన తర్వాత మా లిస్టులనన్నింటిని తంజావూరి లైబ్రరీ కిచ్చి వేసితిమి. ఆలెక్క