పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లుచుకొనివచ్చిరి. చూడఁగా నా హరపదార్ధములుంచినవి యుంచినట్లే యుండెను. వెంటనే లేపి, ఒడలు పిసికి, యెఱుక తెచ్చి యాహారము గొనిపించిరి. మూఁడునా ల్గిడ్డెనలు, చెంబెడుమంచినీరు, కాఫీ త్రాగి, శక్తి రాఁగా మరల యోగ సాధనముల సాగింపించిరి. పావు గంటసేపు ప్రబలముగా సాధన జరిగెను. అంత తివ్రయే నాఁ డుండుటకు కారణము శ్రీవారి యానాఁటి ప్రజ్ఞతీవ్రతయే యగుట నక్కడి వారు తెల్పిరి. నాఁడు మహోత్సాహముతో దంపతుల ముంటిమి.

   ఆసాయంకాలమే నేను మద్రాసు వెళ్ళవలెను. నా కోర్కి తీరలేదు. మరల శ్రీవారి దర్శించి నా కోర్కి- మా తలి దండ్రుల విషయమును ప్రశ్నించితిని. శ్రీవారు శరీరములను జిరకాలము రక్షింప ననువు పడదు. అయినను నీవు వెంటాడు చున్నావు గాన చెప్పుచున్నావు.' నీవు యోగ సిద్ధుఁ వై తేని-' దశపూర్వేషాం దశపరేషాం-మివంశ్యులకు నీ యోగవాసన లంటి వారు కడతేరఁ గలరు. పది సంవత్సరములు విడువక నాయాదేశము చొప్పున యోగా భ్యాసము చేయవలెను. అన్నివాంఛితములను నీవే నెఱవేర్చుకొనఁగల్గుదువు. ఇప్పటికి మి తల్లిదండ్రులు లక్కడనే ఉండియీనాయుప దేశించు విధానము నాచరింతురుగాక' అని తద్విధానము తెల్పిరి. నే నెంతో ఉప్పొంగితిని.
   కాని యానాఁడు తెల తెలవాఱునపుడు వారిని దర్సించి నప్పుడు భాషించిన తెఱఁ  గునకు, నే నొక్క దాని నడుగఁగా