పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేను చిరకాలము సెలవులో నుండి డ్యూటిలో చేరి మరల సెలవు గొనుట దుఃఖకరముగా తోఁచుటచే నెటు చేయను జాలక చిక్కు పడుచుంటిని. ఇంటిదగ్గఱ నుండ నిష్టము లేదు. జ్వరము వచ్చుచునే యుండుటచే నూళ్ళ వెంట నొంటరిగాఁ దిరుగఁ జాలను. ఇట్టి యిక్కట్టులోనింటికి వచ్చిన వారము రోజులలోనే నాకు ఆఫీసు నుండి టెల్లిగ్రాం వచ్చెను.' తత్క్షణమే నీవు తంజావూరు లైబ్రరీ పరిశీలనమునకు వెళ్ళవలసినది. అక్కడ చేరి పనిచేయువలసినది' అని. అలిగి తన్నితే పఱుపుమిఁద పడ్డట్టు, రొట్టెవిఱిగి నేతిమిఁద పడ్డట్టు నాకు పరమోత్సాహకర మయినది.

   తోడ్తో బయలు దేఱి మద్రాసు వచ్చి ఆఫీసుకు వెళ్ళి లైబ్రేరియ౯ తో మాట్లాడి మద్రాసులో నాగక కుంభకోణమునకే వెళ్ళిపోయితిని. అప్పటికి మా తోబుట్టువు కుటుంబము మద్రాసులో నుండెను. మా తమ్ముఁ డు చి" చంద్రశేఖరము అక్కడ హైస్కూలులోచదువుచుండెను. వాని కక్కడ టైఫాయిడ్ జ్వరము వచ్చెను. శ్రీ వారికి జాబు వ్రాసితిని. మద్రాసులో వారి శిష్యుఁడుగా నున్న మన్మిత్రు నొకని ట్రీట్ చేయవలసినదిగా జాబు వ్రాసిరి. ఆతఁడు వచ్చి ట్రీట్ చేసి యీ జ్వరము  తగ్గిన తర్వాత నీ కుఱ్ఱవానికి శ్రీవారి శిష్యత లభింపజేయవలసిన దనియు, దానివల్ల నీతఁడు కొఱఁతలు దొలఁగి యారోగ్యము పడయఁ గలఁ డనియు దివ్యదృష్టికి గోచరించిన దానిని దెలిపెను. నెలా పదిరోజులు జ్వరము వానిని బాధించి విడిచెను.