పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుంభకోణమున శ్రీ వారిని దర్శించి నాకధ యెల్లఁ జెప్పికొంటిని. శ్రీ వారు నన్ను ప్రతివారము సెలవు దినమున తంజావూరి నుండి కుంభకోణము వచ్చుచుండు మనిరి. ఆ కాలమున రైలుఛా ర్జీ అర్ధరూపాయ లోపుగా నుండెను. అట్లే చేయుచుంటిని. తంజావూరిలో నాకుత్యాగరాజయ్య రను మిత్రుఁ డేర్పడెను. ఆయన శ్రీవారి శిష్యుఁడు. ఇర్వురమును గలసి ప్రార్ధనము చేసుకొను చుంటి మి. జ్వరము తగ్గి యారోగ్య వంతుఁ డయిన మాతమ్ముఁడు వదిన గారిని దోడ్కొని కుంభకోణమునకు వచ్చెను. వానిని శ్రీవారి శిష్యునిఁ గావించితిని.

   చల్లపల్లిలో ఆరంభించిన చలిజ్వరము ఎడనెడ నాకు నేను కుంభకోణము వెళ్ళిన తోడనే తీవ్రముగా జ్వరము వచ్చెడిది. మజ్జిగ అన్నమే తినఁ గల్గెడి వాఁ డను. రాత్రి ఒకటి రెండు గంటల వేళ తీవ్రముగా ఆకలి యయ్యెడిది. అప్పుడు ముందుగానే నాకై జాగ్రత్త పడి సచ్చిదా నంద  స్వాముల వారు ఊరుగాయ, మజ్జిగ అన్నము ఎత్తి దాచి యుంచెడివారు. ఆకలయి నపుడు వారిని లేపి యది తిని నీరు ద్రావి నిద్రపోయెడి వాఁడన. ఉదయము జ్వరముతో నే తంజావూరికి వచ్చెడి వాఁ డను-వచ్చిన కొంత సేపటికి జ్వరము తగ్గిపోయెడిది. వారమురోజులు నెమ్మదిగా ఆఫీసు పని  చేయఁ గల్గెడు వాఁ డను. నాతో రామకృష్ణ కవిగారు వగైరా లుండిరి. వారు మద్రాసు వెళ్ళినప్పుడు శ్రీ కుప్పు స్వామి శాస్త్రిగారితో నేనేదో కుంభకోణము వెళ్ళి యోగసాధనము చేయుచుంటి ననియు, అక్కడికి వెళ్ళిన