పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కారణములుగా తల తిరుగుట, వాంతులు, జ్వరము నాకు నారంభించెను. ఇంటికి చేరు నప్పటికి నాకు 100 డిగ్రీల జ్వరమున్నది. నేను మందుఁ గొన ననుచుంటిని. కుంభకోణము టెల్లిగ్రాం ఇయ్యఁ గోరితిని. వెంటనే మా వా రట్లు చేసిరి. కాని యది వారి కందుట నాఁటి రాత్రి యగునో, మర్నాడగునో, చాల తీవ్రజ్వరము గాన మందిచ్చి తీర వలసిన దే యని నాకుఁ జాటుగా మా తల్లిదండ్రులు, నన్నగారు చర్చించుకొనుచుండిరి. అది వింటిని పిల్చి యడిగితిని.' మందు గొన వలసినదే' యనిరి. అంగీకరించితిని. సాయంకాలము ఆఱుగంటల వేళ కు మందిచ్చిరి. అప్పుడే ఆకాశమున నుండి దభీలున క్రిందఁ బడుచున్నట్టు లయి యొడ లెల్ల చెమ్మటనీరు చిమ్మఁ దొడఁ గెను. పది నిముషములలో జ్వర మెల్లతగ్గెను.' మంది చ్చితిమి. తోడనే తగ్గెను' అని మావారనుకొనిరి.' ఇచ్చిన టెల్ల్లిగ్రాం శ్రీవారికి చేరినది. ట్రీట్మేంటు జరగియుండును. తోడనే తగ్గినది' యని నేను దనిసితిని. మర్నాడు తేటగానే యుంటిని. మందు గొనుచుంటిని. మూఁ డ వనాఁడు మరల జ్వరము వచ్చెను. నాఁ డు కుంభకోణము నుండి జాబు వచ్చెను.' జ్వరము తగ్గియుండును. మందు గూడ పుచ్చుకొన వచ్చును, అని. మందు పుచ్చుకొనుటకు దైర్యము వ చ్చెను. పుచ్చు కొనుచుంటిని. సెలవు లేదు. శ్రీ రామకృష్ణ కవిగారును జ్వరము మరల మరల వచ్చును తంటాలు గొల్పుచుండుట చే సెలవు తీసికొని మద్రాసుకు వెళ్ళిపోయిరి.