పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నక్కఱలేదు. మీసము లుండుట లేకపోవుటలో న్యునాధికత లుండవు. ఈ సమాధానములు తోఁ చి నా మనసులోని యప్పటి మకిలను దొలఁ గించినవి.

కొంత కాలమయిన తర్వాత నేను మరల కుంభకోణము వెళ్ళి యుండఁ శ్రీ వారే నే నడుగ కుండనే యీ విషయమును గూర్చి యిట్లనిరి.' నాకు శిష్యులుగా నుండువా రెవరు గాని లోకమునకు విడ్డూరముగా తోఁచదగిన వేష భాషలతో నుండుట బాగుగాదు. నలుగురతో పాటుగానే యుండ వలెను. ఈ యోగమున నెవఁ డుగాని ప్రత్యేకముగా కడ తేరఁ జాలడు. తాను, తన చుట్టుపట్టుల వారు, తన యాప్తులు నను క్రమమున ప్రేమ వ్యాపకమగు తీరు ననుసరించి తాను, తన చుట్టుపట్టుల వారు, తన యాప్తులు నను క్రమముగా లోకము నంతను బ్రేమించి లోక మునంతను గడతేర్చు వాఁడు కావలె తన ప్రేమ సర్వలోక వ్యాపకము కానంత వఱకు నెవ్వఁడు గాని కడ తేరఁ జాలడు. ఆ ఖండము, సర్వ వ్యాపకుఁడు కాక తప్పదు. దేశకుల జాతిమతాది పరిచ్చేద ములతో వేఱు పడిపోవు సర్వ ప్రజతో సామరస్యము కుడు ర్చుకోలేని వాఁడు సంసార బంధమున కొట్టు కాడవలసినవాఁడే! బహిర్ముఖముగా సాగుచున్న బహుత్వమును సాగనిచ్చుచునే అంతర్ముఖముగాఁ దిరిగి అం దేకత్వమును గుర్తించి వర్తించుట ఈ యోగ సాధనమున కొక ఫలితము. మన పరిపూర్ణత భవిష్యత్తులో నున్నది గాని భూతము