పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇత్యాది సూక్తులు స్ఫురణకు వచ్చి భాషలో నే మున్నది? విషయము గదా ప్రధాన మయినది! ఏ భాష యయిన నేమి? అందును జాతిమాత దేశాదికృత మయిన పరిచ్చేదము లేకుండ సర్వసమానముగా సాగవలసిన యిట్టి మహ త్తర యోగ పద్ధతికి- నేఁడుప్రపంచవ్యాపకముగా నున్న యాంగ్ల భాషయే సరిపడి యుండు నేమో! మఱియును సంస్కృతమున కట్టి పూజ్యత మహార్షలు తమ యుద్బోధములునందే వెలయించు చేతను ఉపనిషత్తులును, వేదములును నందే యుండుట చేతను వచ్చినది- అట్టి వానిని నిపుడును వెలయింతురో యా భాషకుఁ గూడ నట్టి యోగ్యత కలదని యంగీకరింపక తప్పదు. నేఁ డెందరో మహనీయు లా భాష ద్వారమున ననే కాపూర్వ శాస్త్రా ర్ధములు వెలయించుచున్నారు. దీనిని పరిగణింపక త్రోసి పుచ్చుట సాధ్యము కాదు. కనుక శ్రీ వారి యోగో పదేశ భాషాదు లాంగ్లమున నుండుట కొఱఁత గాదు.

   మఱియు వారి యాకృతి మహనీయతకు మీసము లుంచుకొనుట, మొగమున బొట్టు పెట్టు కొనకుండుట కొఱఁత పఱుపఁ జాలవు. శైవ వైష్ణ వాది మత భేదములను బాటించు వారు గాన వారు మొగమున తన్మత చిహ్నముల ధరింప కుండ వచ్చును. వారు నెలకొల్పినది మహా రాజ యోగముగాన దీనికి బోడితల కాషాయవస్త్రములు మొదలగునవి యుండ