పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలేదు.కనుక భూత మను పీఠిక పై నెలకొని భవిష్యత్తున పరమార్ధ మను భవింపవలసి యున్నది.'

   శ్రీవారి దివ్య ప్రజ్ఞలలోనొక్కటి  యిది. ఎవ్వరుగాని లోనేదేని సందేహమో, వ్యాకులపాటో చెందుచు సన్నిధికి వచ్చినప్పుడు వారి నడుగకే, వా రడుగకే వింతగా దానికి సమాధానము యాదృచ్చిక సంభాషణ సందర్భమున వెల్ల డించుట-ఒండె-ఆ సమాధానము నడిగి తెలిసి కొనఁగోరి వారి సన్నిధికి వచ్చు నంతలో నాపృచ్చకు తీరులోనే యాసమాధాన మాప్రష్టల కెఱుకపడకుండనో, అంతలోనే యెఱుక కందుచునో శ్రీవారు నోరెత్త నావశ్యకత లేకుండనే బాహిరపడుట__
   ఒక చిన్న దృష్టాంతము. ఇంజనీయరింగ్ డిపార్టు మెంటులో ఉద్యోగిగా నున్నయొక  శిష్యుని ఢిల్లీలో హెచ్చు జీతముతో నుద్యోగించుటకు సమ్మతింతువా యని పైయధికారులడిగిరి. నాఁటి సాయంకాలపు టపాలో దానికి బదులు వ్రాసి పంప వలెను. దీని నడిగి తెలిసికొనుటకే ఉదయ మాతఁడు మద్రాసు నుండి వచ్చి వెంటనే తన విషయమును శ్రీ వారికీ విన్నవించెను.' సరే! టపా వేళలోగా యోచించి బదులు చేప్పుదు' ననిరి. సాయంకాలము టపావేళ దాటి పోవచ్చినది. శ్రీవారాతనిఁ బిలిచి బదులేమి గాని చెప్పరయిరి.
   ఆతని యోచనలు తీవ్రముగా రేగెను. అనుకూల ప్రతికూల పక్షముల యుక్తులు గుప్పుగుప్పు మని లోనుండి వెల్వడఁ జొచ్చెను. త్రాసున తూపగా ' వెళ్ళవలదు' అన్న