పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యోగములో చేరిన తేది 22-6-1916. మిడియము సంఖ్య 330. వీలుపడదు. మరల మూసికొనియే పోవును. శరీరములో నప్పుడు జరగవలసిన దెల్ల జరగగానే కన్నులు తెఱపి యగును. అటుపై కనులు మూసికొని పండుకొనుట కష్టమని పించును. అందాఁ క కనులు తెఱవను, లేవను కష్ట మని పించును' అని స్వాముల వారు దగ్గఱ నుండి తెలియఁజెప్పిరి. అట్లే ఉపదిష్టము నొక్క మారే సార్ధకముగా స్మరించి యుచ్చరించి కనులు మూసికొని పండుకొంటిని.