పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

౨౪

అనుభూతి

తోడ్తో నాలో నేదో గొప్పప్రజ్ఞ ప్రవేశించి యూగించి వైచుచున్నట్లు గోచరింపఁ దొడగెను ఉత్సాహవినోదము లతో దానినే పరిశీలింపఁ దొడగితిని.' ప్రజ్ఞ' యనియో ' శక్తి' యనియో ఇంకేమనియో నిర్దేశింపఁదగిన యపూర్వానుభూతి ప్రవేశము నాలో విజ్రుంభింపఁ దొడఁగెను. అది యెక్కడ నారంభించినది, ఏమి జరపుచున్నది యని వెదకఁ దొడగితిని. అది శరీరచర్మము లోతట్టు దాఁక వ్యాపించు చున్నట్టు తొలుత నెక్కడ నుపక్రమించినదో గుర్తుపట్ట సాధ్యము కానట్టుండెను. శరీరములో నేదో గొప్ప క్రొత్త ఇంజెన్ పనిచేయుచున్నట్లయ్యెను. నా మన స్సానందో త్సాహములతో నలలు వాఱుచుండెను.

కొంతసేపటికి నెడమ చేయి నావశము తప్పి నా సమ్మతి లేకయే పైకి లేచుచుండు ట, కుడిచేయి కదలుచు బహుమూలమున చాల బాధగొల్పుచుండుట తెలియనయ్యెను. అంతకంత కు బాహుమూలపు బాధ యధికము కాఁ జొచ్చెను. సంకటపడ సాగితిని. అప్పటి కించుమించుగా పదునైదు నిమిషముల కాలము గడచియుండును. స్వాముల వారు నన్ను సంకటపడుచున్నా వేమని ప్రశ్నించిరి. కనులు తెఱవ వీలుపడక పోవుటచే మూసికొనియే బాహుమూలముణ చాల బాధగా నుండుట తెల్పితిని. మఱికొన్ని నిమిషములకు కనులు