పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నూనె తిరుగబోత కూరలతో నే నానాఁడు భోజనము చేసితిని. అంతకుముం దట్టి భోజనము చేసినచో కడుపులో మంట. నిద్రరాదు. ఆ శాంతి అధిక మయ్యెడిది. స్వాములవారు కంటిని రెప్పవలె నన్నుఁ గాచియుండి నాయనారోగ్యాది విషయములు విచారింపసాగిరి. అన్నియుఁ జెప్పితిని. మర్నాటి రాత్రి వఱకే నే నక్కడ నుండ వీలగుట తెల్పితిని.

ఉపదేశము

  • [1] నాటి సాయంకాలము ఆఱుగంటలకు నాకు శ్రీ వారి శిష్యతాను గ్రహము లభించెను శిష్యతాను గ్రహము పడయుటకు సమకూర్చుకోవలసిన వాని నన్నింటిని స్వాములవారితోడ్పాటుతో సమకూర్చుకొంటిని. ఉపదేశవిధాన మెల్ల స్వాములవారు సూచించిరి. శ్రీ వారి సాష్టాంగముగ నమస్క రించి నాయభ్యర్ధనము నివేదించుకొంటిని. ఉపదేశము చేసిరి. వెంటనే' నీవు హాలులోనికి వెళ్లి ప్రేతాసనమున శయనించి, నమస్కరించి, ఉపదిష్టము నొక్క మారే యుచ్చరించి, కనులు మూసికొని, శరీరము లోతట్టున నే మేని జరుగను గనుక దానిని గుర్తించుచుండుము. మనస్సు బహిర్ముఖమై యెక్కడి కేని పోయినచో పోనిమ్ము. నీవై యరికట్టవలదు. ఆదే తిరిగి రాఁ గలదు. ఏమి జరుగునో సాక్షిమాత్రుఁడవై పరికింపఁ దలపు గొనుము. అంతే నీవు చేయవలసినది. కొన్ని నిమిషముల దాఁక కనులు తెఱవ ప్రయత్నింపకుము. ప్రయత్నించినను దెఱవ
  • * యోగములో చేరిన తేది 22-6-1916. మీడియము సంఖ్య 330.