పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యింటనే యుంటిమి. డాక్టరు నారాయణస్వామి నాయని గారిని రాఘవ రావుగారే పిలుచుకొని వచ్చిరి. ఆయన పరీక్షించి విరేచనములకు మంది చ్చి జబ్బేమి లేదని వెడలి పోయెను.

అప్పటికేమొదటిమహాసంగ్రామ మారంభ మయి సాగుచున్నది. ఆ యుద్ధమున గూర్చి క్షోభ నాలో తీవ్రముగాస సాగుజొచ్చినది. నా యనారోగ్యము దుర్భరముగా నుండెను. డాక్టరు నంజుండరావుగారు మందిచ్చుచుండిరి. అట్లు నాల్గయిదురోజులు గడచిన తర్వాత నొకనాఁడు నా దేహ మెల్ల చిమ్మచీకట్లు క్రమ్ముచున్న ట్లయి ఒడలెల్ల ధారలుగా చెమటలు దిగజారి లోన నుండి తీవ్ర బలము, ప్రజ్ఞ పోగారు చున్నట్టయ్యెను. నంజుండరావుగారు నరములకు, గుండెకు బలము కలుగుటకు మందిచ్చు చున్నారు గాన దాని కార్యమది యనుకొంటిని. ఆనాఁడు తివ్రోత్సహముతో నుంటిని. నంజుండరావుగారు కొనాళ్ళు సెలవు పెట్టి స్వగ్రామమునఁ గొన్నాళ్లుండి రమ్మనిరి. నెల కాఁ బోలు సెలవు పెట్టితిని. ఇంటికి నే నొక్కఁ డనే పయనమయితిని. తమ్ములు, భార్య మద్రాసు లోనే యుండిరి.

బందరులో గురువర్యులగు శ్రీ వెంకట శాస్త్రి గారికి కాబోలు నేదో బంగారువస్తువు వారు సొమ్ము పంపగా చేయించుచుంటిని. దానిని తీసికొని వచ్చుటకై ఆఫీసునుండి సాయంకాల మా ఱుగంటల వేళ టౌనులోని కరిగితిని. చెన్నకేశవస్వామి గుడి ప్రాంతముల నున్నది యా సెట్టిగారి యిల్లు.