పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేను వెళ్ళి సొమ్మిచ్చి వస్తువులను దీసికొని. మీ సోదరుఁ డేడి యని యా సెట్టిగారి నడుగగా నేఁ టికి పదునై రోజుల క్రిందట ఆతఁడు శ్రీ కన్యకాపరమేశ్వరి దేవాలయమునకు రాత్రి పదిగంటల వేళ వెళ్ళి యక్కడ పూజోత్స వాదులు దర్శించుచుండగా ఎమ్డెన్ గుండు దెబ్బ వినవచ్చెను. ఒక గుండలోని తునకు కన్యకాపర మేశ్వరి దేవాలయా వరణలో పడెను. దాని వెల్తురు చూచినతోడినే గుండె పగిలి నెత్తురు వాంతో చేసికొని చనిపోయెను. అని సవి స్తరముగా నా సెట్టిగారు చెప్పిరి.

అది వినఁ గానే నాకు మరల శరీర మెల్ల సదరిపోయి చల్లబడి మృత్యుకల్ప మయిన స్థితి కల్గెను. నా వికృతి నా సెట్టిగారి కెఱుఁగనీయక వెంటనే యటనుండి వెడలి గోవిందప్పనాతని వీధి మొగనే యొంటరిగా కాపుర మున్న శ్రీ పురాణం సూర్యనారాయణశాస్త్రి గారి తోడ్పాటు కై వారి యింటి కి వెళ్ళితిని. చాల నీరసించి యెట్లో చేరగల్గితిని. ఉదయము పది గంటలకు చేసిన భోజనము అంతకు ముం దాకలి కూడ తీవ్రముగా నుండెను. అప్పటికి హొటలు, కాఫీ వగైరాల యలవాటు నాకు లేదు. వడిగా ట్రాము మిద నన్నిల్లు చేర్పాగోరీతిని. ఆయన కాశీ విజయనగర నివాసాభ్యస్తమయిన 'భంగు'పాన పారాయణుఁడు. అది నూఱి త్రాగి కాని కదలఁజాల ననెను. అవస్థపడుచు గూర్చింటిని. భంగుతయారు చేసికొని త్రాగి నాతో బయలు దేరి నన్ను మా యింటికి చేర్చిరి.