పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆఫీసు నుండి యింటికి వచ్చిన తర్వాత వారి యింటికి వెళ్ళి అక్కడి కష్ట సుఖములు విచారించి వచ్చితిని. వచ్చునప్పుడు మా వారీయఁ గా మొక్కజొన్న కండెలు తెచ్చితిని. రాత్రి మే మందఱము వానిని భుజించితిమి. నిద్రలో రాత్రి రెండు గంటల వేళ నాకు మెలఁ కువ, శరీరమంతా అలకడి. కలరా వ్యాధి కృమి ఆ మొక్కజొన్న కండెలతో అంటి వచ్చి నాలో చొచ్చినట్టు, నాకు కలరా వచ్చినట్టు బావన. బహిర్భూమికి వెళ్ళ వలసెను. రాత్రి గనుక నే నున్న చోటు (తిరువళిక్కేణి సాతానివీధి తుది మేడ) కొబ్బరి తోటలు గలది గనుక ఇల్లు విడిచి బైతికే వెళ్ళితిని. వట్టి గాలియే అమితముగా వెళ్ళెను, గాని విరేచనము కాలేదు. ఇంటికి వచ్చి యీజి చైరులో కూర్చుంటిని. ఒడలెల్ల కంపించిపోవు చుండెను. నాల్గు మూఁ డు గజముల దూరమున - బందరులో కలరాతో చనిపోయిన మా బావగారి తల్లిగారు అఱువది యేండ్ల వృద్ధ ధూమ్ర దుఃఖితాగ్రహ విష్టాననముతో ప్రత్యక్ష మగుచుండెను. చీకాకు కలిగెను.

అంతకు ముం దట్టి దుర్దర్శనము నే నెన్నఁడు నెఱుఁగను. నిద్ర రాక చీకాకుతోనే ఆ రాత్రి గడపితిని. ప్రొద్దుట శరీర మంతయు కీలుకీలు విఱిచినట్టు నొప్పి. పదిగంటల వేళ ఆఫీసుకు పోవలెను గాన భోజనము చేయబోయితిని. ఒక ముద్ద మ్రింగితినో లేదో ఒడలెల్ల అదరి చల్లబడి పోయి మృత్యు ముఖమున నున్నట్లయితిని. తమ్ములు స్కూలుకు వెళ్ళిరి. నేఁడు హైకోర్టు జడ్జిగా నున్న చింతకుంట రాఘవరావుగారు నేను నొక