పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నగుట యేర్పడడుటచే అమ్మి వేసితిని. ఆ పుస్తక విక్రయము వల్ల వచ్చు నా యతిచే సుఖముగానే జీవిత యాత్ర గడపు చుంటిని. తమ్ము లిర్వురలో ఒకరు స్టాన్లీ రాయపురం మెడికల్ స్కూలులోను, ఇంకొకరు ఆయుర్వేద కళాశాలలోను తర్వాత చదివిరి గాని యప్పటికి కెలెట్ హైస్కూలులో చదువుచు నా దగ్గఱనే ఉండిరి. సుఖముగా జీవయాత్ర సాగుచుండెను.

శ్రీ రామేశంగారికి నటేశన్ , రామయ్యగారు ఇత్యాది గ్రంధ విక్రేతలు మిత్రులు. వారు విక్రయమునకు తెప్పించు గ్రంధముల నన్నింటిని వారము చదివి యిచ్చుటకు వా రింటికి దెచ్చుకొని పుస్తకము లేమాత్రము చెడకుండ చదివి వారి లిచ్చి వేయుచుండెడివారు. ఆ గ్రంధవిషయముల గూర్చి మిత్రుల కందరికి తెలియజెప్పుచుండెడివారు. వారు గ్రంధములను జదువుట పుస్తక విక్రేతల కధికలాభాపాదక మగుచుండెడిది. వారి గ్రంధపఠనోత్సాహము నాకును జక్కిలిగింత గొల్పినది. లైబ్రరి నుండి ముద్రిత గ్రంధముల దెచ్చుకోనుచుండెడివాఁ డును. ఒకటే చదువు! అప్పటి నా వయస్సిరువాడియాఱు.

అప్పుడు తెలుఁ గు దేశమున పెక్కు చోట్ల కలరా వ్యాపించియున్నది. మద్రాసులోను కలరా ఉన్నది. బందరులో మా బావ గారి తల్లి కలరా వచ్చి మృతిచెందెను. మద్రాసు నుండి మా బావగారు, మా తోబుట్టువు ఆమెగారి యౌర్ధ్వ దైహికమునకు బందరు వెళ్ళిరి. వారు తిరిగివచ్చునప్పు డక్కడ నుండి కొన్ని మొక్కజొన్న కండెలు తెచ్చిరి. వారి రాక తెలిసి