పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరులు గుర్తింపఁ గల్గుచుందురు. అంతరంగమున స్థాయిగా ననురాగము, ప్రేమ ఉన్న సందర్భములను గూర్చి వ్రాసినదిది.

ఆత్మావేక్షణపరులు లోనికి బోగా పోగా ఇఁక పోవ నెడము లేకుండ హద్దుగా గుర్తింప నగు నెలవు ప్రేమైక మాయముగానే ఉండుగా.ప్రేమ సత్పదార్ధము కాన నిత్యము.ఆ స్థలముణ ప్రేమేతర (ద్వేష )వాసనకూడ నుండదు.అద్దానిని జేరుకొనుట కై లోనికి బోను పోను,ప్రేమే తదార్ధము పలుచబడుచు సన్నసన్నగా దిగనాసిల్లు చుండును. ప్రేమపదార్ధము చుక్కనగుచు దాని విజ్రుంభణము అంతరంగంమునే కాక బహిరంగమునఁ గూడ 'అంత ర్బహిశ్చ'క్రమక్రమముగా నిండా ర్చును.అసలు తత్త్వన్వేషి సముద్రమధనకధగా సత్సంకల్పపు మందర పర్వతమున శరీరసముద్రమున దింపి శరీరము మిధింపగా లోనుండి మంచి చెడ్డలు రేగుచుండును.చేడుగులను దొలఁగఁ ద్రోసి కొనుచు మంచిని గుర్తించి స్వీకరించి మనుభవించుచు బోవఁగాఁ దుదకు అమృత లాభము కలుగును.ఇందు మూలాదారము కూర్మమగును.

అప్పుడే గార్హస్ధ్యము నందిన మా బావగారిని నా దుఃఖ కారణము విచారింపఁ గోరిరఁట! ఒకనాఁడు నిద్రలేచి యూరి నంటి యున్న మా పొలమున కరిగి అక్కడి మా మంచినీటి బావికడ కాలకృత్యముల దీర్చుకొని స్నానోన్ము