పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేయుట, గర్హించుట, తిట్టుట, కొట్టుట గూడ జరగుచుండును. అందులో నంతరంగము నవ్యక్తముగా, స్థాయిగా అనురాగమే కుదుర్కొని యుండును. అట్టిచో చివ్వన కోపము రేగును. కోపసూచన మొదలుగా కొట్టుట దాఁక వివేకపరిపాకనుసారము నొక చేష్ట జరగుచుండ అంతరంగమున కేసి చూడఁ గా నక్కడ అనురాగ రేఖలు నవ్వుచుండుట, అవి తన్నే కోపించుట, తిట్టుట, కొట్టుట, జరపినట్లయి యిఁక నిట్టి చేష్టలు చేయకుమా యని మంద లించుట అంతరాత్మావేక్షణా నుభూతి కలవారి గోచరించును. రేగిన యా కోపోద్రేక మా మానవుని యంతరంగము తనలో హాయిగా నున్న యనురాగము శరీరాణువులం దంతటను నిండారుటకు చేయు జతనములో తనకు విరుద్ధమయిన, తనతో లోనుండ గూడని కోపపు బండాల మునదను చూచి బైటి వెడల గోట్టునప్పుడు చెలరేగి బయటబడి నది గగుర్తింపనగును. శరీరమును జుట్టియుండి నావృత్తి దాకఁ నది యెఱ్ఱని పొగలతో చెలరేగి దిద్దుబాటు చెంద వలసిన వారిని దాఁకి వారి యనుకూల్య ప్రాతికూల్య, సౌమనస్య, వైమనస్య, ప్రబలు, దౌర్బల్యాద్యనుగుణముగా దను చేయఁ గల మంచిని జేసి యుపరత మగును. ఈ విధముగానప్పు డప్పుడు లో నిల్వయున్న కోపపు సరకులో నెంతో కొంత అసత్పదార్ద మగుటచే నిలువ వీలులేనిది కాన కర్చు పడి పొగా పోగా లో స్థాయిగా నున్న ప్రేమ సత్పదార్ధము గాన శాశ్వతమై పెంపొందుచుండును. దీని నాత్మావేక్షణ