పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మార్గము మంచికో,చెడుగుకో దారి త్రొక్క నారంభించు సంఘటన దాపురించినది. ఎందఱ కుటుంబములో యిట్టిపట్టుల నప మార్గములఁ బట్టినవి కానవచ్చినవి. ఇంక నెందఱ కుటుంబముతో సన్మర్గముల బట్టినవి కానవచ్చినవి. ఏవంవిధమయిన కొట్టుకాడుచున్న నా ముఖమున న శాంతిలక్షణములు ప్రవ్యక్తముగా గోచరించుచుండెను. వానిని జూచి మా తల్లిదండ్రులు, నక్క గారు త్రొక్కట పడఁజొచ్చిరి.

సంతోషము గాని సంతాపము గాని యంతరంగమును కలవరపఱచుచున్నప్పుడు దాని చేష్టయ కృత్రిమముగా, స్పష్టముగానున్న దున్నట్లు కొందఱ ముఖమున గోచరించుచును. కొందఱు లోని సంతోషము దాఁచి యుంచు కొని ముఖమున, సంతోషమును దోపయకున్న మానెగాని, యేవో ప్రయోజనము లర్ధింప పైగా విచారమునే వెలయించుకొనఁ గల్గుదురు. ఎంత దుఃఖకారణము కల్గినను దాని బలమును వివేకముచే తగ్గించుకొని దానిని లోనగూడ భావింపకుండుట మంచిది గాని లోన కుములుచు బైటికి నవ్వు దెచ్చుకొనుట రోఁతయే. అ నవ్వు వెడన వ్వగునె కాని తియ్యని నవ్వుగా తెరలు వాఱదు. స్మిత ప్రయత్నమే కాని దాని సత్ఫలితము కలుగదు.

తాను ప్రేమించువా రెవ్వరు గాని తప్పు చేసినట్టు తాను భావించునప్పుడు వారిని సరిదిద్దఁ గోరునపు డాయా వ్యక్తుల వివేక పరిపాకము ననుసరించి కోపసూచనలు