పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఖుఁడ నగుచు తాటిచెట్టు చాటు కరిగి దుఃఖించుచున్న నన్ను వెనుకతట్టున నుండి వచ్చి పట్టుకొని మా బావగారు దుఃఖకారణము ప్రశ్నించిరి.ఏమి లే దంటిని. ఉన్నను,అది చెప్పినను మిరు దాని విలువ గుర్తింప లే రంటిని.ఆతఁడేదో గొప్పదోషము నాలో నున్న దనుకొని తీవ్రముగా చకితుఁ డయి పదింబదిగా ప్రశ్నింపఁ దొడఁ గెను. నా కేదో యోగ్యతాలో పభీతి కలదని యాతఁ డనుమానపడుచున్నట్టు తోఁ చెను. ఇఁ క దాపరాదని యున్న దున్నట్టు చెప్పితిని.మా తలిదండ్రుల పతనము గోచరించుచున్నట్టున్న దన్న మాట మా తలిదండ్రులతో చెప్పరా దని యాన వెట్టితిని.అంతా విని యాతఁ 'డయ్యో యిదా నీ యేడుపు!'అని పగలబడి నవ్వఁ జొచ్చెను.' లోకసాధారణము మయిన భావము లనునీ తలనే విఱిగిపడిణ వానిగా భావించి యఘోరించెద వేల 'యని తెగడెను.తర్వాత మా తలిదండ్రులతో నుచిత మగునంతవఱుకు చెప్పి వారిని తేర్చెను. రాగవిరాగములు రెండుగా నాలో నప్పుడు రేగినవి.

ముహూర్తము జరిగినది.తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనము వంటిదే యిది కూడ నయ్యెను. వాత్స్యయన కామసూత్రాది గ్రంధము లేవేవో చదివి యుంటినే కాని అది పుస్తక విద్యయే కానీ యనుభూతి లేనిది.నాకు నర్మసచివుఁడు మా బావ మర్నాడు శుష్కేష్టితంత్రముగా