పుట:Prabodhanandam Natikalu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోతున్నాను, రేయ్‌ వెళ్ళిపోతున్నాను. (గట్టిగా అవలించి, తలవిదిలించి ఒళ్ళు విరచుకొనుచు దయ్యము విడచిపోవును)

కాటమయ్య :- నాయనా వేణూ! మీగురు నామము మహాశక్తివంతమైందే! ఏమో అనుకున్నాను దయ్యాలుసైతం భయపడి పారిపోతున్నాయి. ఇక ఎప్పుడూ నిన్ను ఏమీ అనను, నీ బుద్ధి పుట్టినప్పుడు ఆశ్రమానికి పోయి వస్తూవుండు, ఇంటిపనులు చేస్తువుండు.

వేణు :- సంతోషం తండ్రీ, మీ అందరి మనసులు మా గురువుగారే మంచిగా మార్చినారు.


శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి (అందరూ జై అందరు)

త్రైత సిద్ధాంత ఆదికర్తకు (అందరూ జై అందరు)

శ్రీ ప్రబోధాశ్రమ గురుదేవునికి (అందరూ జై అందరు)

---సత్‌ సంపూర్ణం, ఓం తత్‌సత్‌---

-***-


త్రిమూర్తులు

ఒక వైష్ణవుడూ, శైవుడూ ఒకరికొకరు ఎదురుపడుతారు. వారిరువురి సిద్ధాంతములు వేరువేరు కావడమూ, అనాదిగా శైవ, వైష్ణవ సిద్ధాంతముల మధ్య విబేధాలు ఉండడము వలన, వారిరువురికి ఒకరికొకరు సరిపడక మా దేవుడుగొప్ప అంటే, మా దేవుడు గొప్ప అని ఈ విధముగా వాదులాటకు దిగారు.

--సీన్‌ నెం.1--

అడ్డనామం, నిలువునామం చెరొకవైపు నుండి వచ్చి ఎదురుపడతారు.