పుట:Prabodhanandam Natikalu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూర్ణయ్య :- ఒసేయ్‌ ముసలిముండా! బ్రతికినన్నాళ్ళు సాధించావు, చచ్చినాక కూడ సాధించడానికి వచ్చావా.

కనక మరెమ్మ :- ఒరేయ్‌ ముసలిముండా కొడకా నోరు మూసుకుంటావా లేదా?

పూర్ణయ్య :- దీనికి చచ్చినాక కూడ నామీద గౌరవం లేదే. కర్మ కర్మ సరే మూసుకుంటాను లేవే.

(నోరు మూసుకొని ప్రక్కకు పోవును)

కనక మరెమ్మ :- రేయ్‌ కాటమయ్యా! ఇందాక నుంచీ చూస్తున్నాను. నా చిన్న మనవడు వేణూగాని మీద కారాలు, మిరియాలు నూరుతున్నావు. వాడు ఎక్కడబోతే నీకేమి? ఎక్కడుంటే నీకేమి? వాడంటే నాకు చాలా ప్రేమ, ఇకముందు వాడినేమైనా అన్నావంటే నేను సహించను. మీ సంసారాన్నంతా చిన్నా భిన్నాం చేస్తాను. తెలిసిందా ఆ...

కాటమయ్య :- అమ్మా నాకు బుద్ధివచ్చింది. ఇకముందు వాడినేమీ అనను. బుద్ధిమంతుడై సంసారమన్న చేసుకోనీ, సన్న్యాసై చిప్పదీసుకొని దేశాలన్నా పట్టనీ, ఏమన్నంటే నీమీదొట్టు ఇంక పోతల్లి.

వేణు :- అవ్వా! ఇంక నీవు వెళ్ళిపో, వీళ్ళు నన్నేమన్నా భయపడను. అసలు నేనేం తప్పు చేశాను. తాగి తందనాలాడానా, జూదాలాడానా లేక వ్యభిచారం చేశానా అవేమి చేయ్యలేదే. నేను శ్రీ యోగ పీఠాధిపతి ప్రబోధాశ్రమ వాసియైన శ్రీశ్రీశ్రీ స్వామి ప్రబోధానంద యోగీశ్వరుల దగ్గరకు పోయి జ్ఞానం తెలుసుకుంటున్నానంతే.

కనక మరెమ్మ :- ఏమీ! మీ గురువు శ్రీ స్వామి ప్రబోధానంద యోగీశ్వరులా! ప్రబోధాశ్రమమా! ఒరేయ్‌ నేవెళ్ళి పోతున్నాను, వెళ్ళిపోతున్నాను. ఆ స్వామి పేరు ఎక్కడ వినబడితే అక్కడ నేను క్షణమైనా ఉండడానికి వీల్లేదు వెళ్ళి