పుట:Prabodhanandam Natikalu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జూడు (అందరు కలిసి కనకమ్మను పైకి లేపగా కనకమ్మ ఉన్నట్లుండి గట్టిగా అందర్ని విదిలించి పారేసి వెంట్రుకలు విరబోసుకొని ఆవలిస్తూ హూ హూ అని మూల్గుతుంది.)

కాటమయ్య :-(భయంతో కూడిన అదుర్దాతో) ఒరేయ్‌ చంద్రం, ఒరేయ్‌ వేణూ! మీ అమ్మను చూడండ్రా ఇదేందో మాయ రోగమున్నట్లుంది. ఎవరైనా వెంటనే డాక్టర్ను పిలుచుకరండర్రా.

వేణు :- తండ్రిగారు! ఇది డాక్టర్లు నయంచేసే జబ్బుకాదు. ఇది ఒక గ్రహ చేష్ట.

కాటమయ్య :- ఏమిటీ గాలిచేష్టా! ఒరేయ్‌ అడగండ్రా ఎవరో? ఎందుకొచ్చి నారో? ఏమి కావాలో.

వేణు :- మీరంతా ప్రక్కకు తప్పుకోండి నేనడుగుతాను. అమ్మా అమ్మా ఏమైంది నీకు, ఎవరునువ్వు? చెప్పు తల్లీ చెప్పు నీకేంకావాలి.

కనకం :- (గట్టిగా ఒళ్ళు విరచుకొని) రేయ్‌! నేనురా, నేను మీ ముసలవ్వను మర్రెమ్మను.

వేణు :- నాయనా! మీ అమ్మగారంట ఎందుకు వచ్చినాదో అడుగు.

కాటమయ్య :- అమ్మా! తల్లీ ఎందుకు వచ్చావమ్మా, నీకేం తక్కువ చేసాము. ఏటేటా చీరలు, రవికలు పెడుతున్నాం, పెద్ద దినం చేసుకొంటున్నాం గదా.

కనక మరెమ్మ :- ఓరేయ్‌ కాటిగా చీరలు, రవికలు నాకెందుకురా? అయినా నాకవి పెడతారు, మీరేకట్టుకుంటారు. పెద్దదినమని చెప్పి అన్నివంటలు చేసుకొని మీరే దొబ్బి తింటారు. ఏదో మిమ్ములనందరిని చూచి పోతామని వచ్చాన్రా.