పుట:Prabodhanandam Natikalu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉంటుంది. దానినే తెలుగులో గురుత్వాకర్షణ శక్తి అంటారు. ఈ శక్తి కంటికి కనిపించకుండవున్నా సృష్ఠినంతా కంట్రోల్‌ చేస్తువుంటుంది.

వేణు :- ఆ! అదేశక్తినే మేము పరమాత్మయని, దేవాది దేవుడని అంటుంటాము. జీవుడుగావున్న మనము ఆ శక్తిలోనికి లీనం కావడమే ముక్తి అంటాము. ఆ శక్తినే ఆది, మధ్యాంతములు లేనిదని, అవ్యయమైనదని ధర్మశాస్త్రాలు బోధిస్తున్నాయ్‌.

చంద్రం :- వాట్‌! వాట్‌! చాలా ఆశ్చర్యంగా ఉందే! గురుత్వాకర్షణ శక్తినే మీరు పరమాత్మగ చెప్పుతున్నారా, ఐసీ అయితే నేనిప్పుడు పరమాత్మ ఉన్నాడని నమ్ముతున్నాను.

వేణు :- సంతోషమన్నయ్యా! ఇంకొక విషయం భూమిపై జన్మించిన ప్రతి ప్రాణికీ స్వయంగా కదిలేశక్తి ఎలా కలుగుతుందంటారు?

చంద్రం :- ప్రతి ప్రాణమున్న శరీరములోను వారి తలలో మెదడు ఉంటుంది. దానిలో ఒకశక్తి ఉంటుంది. దానినే విల్‌పవర్‌ అంటారు. దానివలన ప్రతి జీవరాసి కదలగల్గుతున్నాయి.

వేణు :- ఆ విల్‌పవర్‌ శక్తినే జ్ఞానులు ఆత్మశక్తి అంటారు. ఆ శక్తిని యోగా భ్యాసము ద్వారా తెలుసుకోవచ్చుననికూడా ఆత్మజ్ఞానులు తెల్పుతున్నారు.

చంద్రం :- వెరీ కరెక్ట్‌రా బ్రదర్‌, ఇపుడు నీ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటు న్నాను. అలా వాదించినప్పుడే సైన్సు, వేదాంతం రెండు ఒకటిగా కలుస్తాయి. ఇటువంటి విషయాలు ఎలా నేర్చుకున్నావు?

వేణు :- మా గురుదేవుని వలన.

చంద్రం :- ఆహా! అయితే మీ గురువు ఆఖండమైన జ్ఞానిగ నాకు అర్థమౌతున్నది. ఆయన కూడా గొప్ప సైంటిస్టు అయివుంటాడని అను