పుట:Prabodhanandam Natikalu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కనిపించే వాటిని శోధించి సాధించగలరు. కానీ కంటికి కనిపించని తత్త్వరహస్యాలు మీకెలా తెలుస్తాయి?

చంద్రం :- కంటికి కనిపించని తత్త్వాలా ఏంటవి, ఎక్కడ ఉన్నాయి?

వేణు :- అవి మన శరీరములోనే ఉన్నాయి. జీవుడు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహం ఇవికాక అనేక గుణాలు బాహ్యనేత్రాలకు ఏమాత్రము కనుపించవు. కంటినితీసి కంటిని, గుండెనుతీసి గుండెను వేయగల్గే డాక్టర్లు శరీరములోని జీవుణ్ణి తీసి వేరే జీవుణ్ణి ఎందుకు వేయలేకున్నారు. మరణ సమయములో జీవుడు కంటికి కనిపించకుండా ఎలా పోతున్నాడో కనిపెట్టగల్గుతున్నారా? పుట్టిన శిశుశరీరములోనికి జీవుడెలా ప్రవేశిస్తున్నాడో చూడగల్గుతున్నారా? ఆకలిదప్పుల్ని జయించగలుగుచున్నారా? ఆశను అదుపులో పెట్టగల్గుతున్నారా?

చంద్రం :- ఓరేయ్‌ బ్రదర్‌! నీవు చాలా పెద్దవాడివై పోతున్నావ్‌ ఇంతకూ నీవుజెప్పే దేవుడు, దేవాది దేవుడు ఉన్నారంటావా, ఉంటే ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు చెప్పుచూద్దాము?

వేణు :- భూమి తనచుట్టూ తాను తిరుగుచు సూర్యునిచుట్టు తిరుగుతూ వుంది. అది ఏ శక్తి ఆధారంతో అలా తిరుగుతోంది? సూర్యుడు చంద్రుడు అనేక గ్రహాలు, నక్షత్రాలు శూన్యములో వ్రేలాడుతున్నాయి. అవి ఏ శక్తి ఆధారముతో నిలచివున్నాయి? సముద్ర జలాలు మేరతప్పకుండా ఉన్నాయి. ఏ శక్తి ఆధారంతో ఉన్నాయి? గాలి క్రమబద్దంగా వీస్తుంది. అలా ఏ శక్తి వలన జరుగుతుంది?

చంద్రం :- డియర్‌ బ్రదర్‌! వెరీ ఇంపార్టెంటు క్వశ్చన్‌ అడిగావురా నాయనా, నీవు ఇపుడు చెప్పిన వాటన్నిటినీ కంట్రోలింగ్‌ చేసేశక్తి ఒకటుంది. దానినే మాగ్నెట్‌పవర్‌ అంటారు. ఈ విశాల విశ్వమంతా దానికి లోబడి