పుట:Prabodhanandam Natikalu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మేము హిందువులమని గొప్పగ చెప్పుకొను మీరు, హిందూ మతములో పరమ, పవిత్ర, పరిశుద్ధ గ్రంథముగ పేరుగాంచినదీ, దేవుడే స్వయముగా చెప్పినదీ అయిన భగవద్గీతను నమ్మరా?

దేవుని మాటను కూడ లెక్కించకుండా వేదములను పారాయణము చేయువారినీ, యజ్ఞములను చేయువారినీ, నా కాలములో తీవ్రముగా శిక్షించాను. యజ్ఞములను ధ్వంసము చేయించాను. అప్పుడు నేను చేసినది మంచిపనియని చెప్పుటకు ద్వాపరయుగములోని భగవద్గీత కూడ ఆధారముగా ఉన్నది.

ఇప్పటికైన మీరు బయటి యజ్ఞములను మానుకొని, దేవుడు చెప్పిన లోపలి యజ్ఞములను ఆచరించండి. మీ కర్మలను ఆ యజ్ఞములో కాల్చండి. మీ కర్మనిర్మూలనమైన రోజు, మీరు దేవునివద్దకు చేరవచ్చును. ఈ మాటలను లెక్కించక, మీ బుద్ధులుమానక, అట్లే యజ్ఞములు చేయుచూ ఉంటే నేను తిరిగి భూమిమీదకు రావలసి వస్తుంది. మీ యజ్ఞములను ధ్వంసము చేయవలసివస్తుంది జాగ్రత్త.

పండితులు :- మమ్ములను క్షమించండి. మీరు ఇంతమంది వచ్చి చెప్పేంతవరకు మేము చేయుచున్నది ధర్మమే అని నమ్మియుంటిమి. ఇపుడు మీ మాటలువిన్న తర్వాత, మేము ఇంతవరకు చేసినది అధర్మమే అని తెలియుచున్నది. ఇప్పటినుండి మేము కూడా యజ్ఞములు, వేదా ధ్యయనములు అధర్మమని ఇతరులకు తెలియజేస్తాము.

నేటికాలములో మీవలె చెప్పుచున్న అచార్య ప్రబోధానంద యోగీశ్వరుల మాటలనే వింటాము. ప్రేక్షకులైన మీరు కూడ నేడు ఎవరూ బోధించని అణగారిపోయిన ధర్మములను తెలియజేయు శ్రీశ్రీశ్రీ ఆచార్య