పుట:Prabodhanandam Natikalu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రబోధానంద యోగీశ్వరుల జ్ఞానమును విని తరించండి...

రావణబ్రహ్మకు...జై

అర్ధ శతాధిక గ్రంథకర్త, ఇందూ ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త

శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులకు...జై

-***-


ప్రబోధానందం నాటిక

(పురాణాల పూర్ణయ్య ప్రవేశించి తన చంకలోని భాగవతాన్ని చేతులలోనికి తీసుకొని పారవిప్పి కండ్లకు మూడుసార్లు అద్దుకొని అక్కడే వున్న కుర్చీలో కూర్చొని పఠనం మొదలుపెట్టును.)


ఆ।వె॥

కృష్ణవాసుదేవం కేశవ పరమాత్మ
అప్రమేయ వరద హరి ముకుంద
మిమ్ము జూడగంటి మీకృప గనుగొంటి
అఖిలసౌఖ్య పదవు లందగంటి


ఆ।వె॥

అతి రహస్యమైన హరిజన్మ కథనంబు
మనుజుడెవ్వడేని మాపురేపు
దా భక్తి తోడ జదివిన సంసార
దుఃఖరాసి బాసి తొలగిపోవు


పూర్ణయ్య :- (ఇంటిలోనికి వేణు ప్రవేశించగానే పూర్ణయ్య చూచి ఇలా అంటున్నాడు) ఒరేయ్‌! వేణూ ఇదేనా నీరాక? మొన్న ఉదయం వెళ్ళిన వాడివి ఇపుడా ఇంటికి వచ్చేది? ఇంట్లో పనులూ,పాటలు విడిచిపెట్టి జ్ఞానం, యోగం, ఆత్మా, పరమాత్మా అనుకుంటూ ఏదో ఆశ్రమానికి పోతుండావంట. మీ నాయన కాటమయ్య ఇప్పుడు నిన్ను చూచాడంటే