పుట:Prabodhanandam Natikalu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యమా పేరుకల్గిన, దండనకర్తయిన కాలయముడు విచ్చేయుచున్నాడు. జాగ్రత్త! జాగ్రత్త!! జాగ్రత్త!!!
(అపుడు యముడు ఠీవిగా సభలో ప్రవేశించి సింహాసనము మీద కూర్చొనును.)

చిత్రగుప్తుడు :- సమవర్తీ! ఇటు ప్రక్కనున్న వారు అజ్ఞానమార్గములో నడిచినవారు. ఒకరు పోలీస్‌ అధికారి, ఒకరు వడ్డీవ్యాపారి, ఒకరు ఉద్యోగస్థుడు, ఒకరు రాజకీయమంత్రిగారు ఉన్నారు. వీరి పాపములను నేనే వ్రాశాను, కావున కొన్నింటిని మాత్రము వారికి గుర్తు చేశాను. అటువైపు ఉన్నవారు జ్ఞానమార్గములో నడచినవారు, వారి కర్మలను చూచువానివి నీవే కావున వారిని ప్రక్కన పెట్టాము.

యమ :- అజ్ఞానమార్గములో నడచి అమ్మగంటును సంపాదించు కొన్నవారిని ఒకప్రక్కగా, జ్ఞానమార్గములో నడచి నాన్నగంటును సంపాదించుకొన్నవారిని మరొకప్రక్కగా ఉంచడము మంచిదే. కానీ నేను చూడవలసిన ఈ ముగ్గురిలో కూడ, నాన్నగంటును సంపాదించుకొన్నవారు లేరు. అందులో ఒకరు మాత్రము నీవనుకొన్నట్లు పూర్తి జ్ఞానమార్గములో నడచినవాడున్నాడు. మిగత ఇద్దరూ ఇటు పూర్తి అమ్మగంటునుకాక, అటు పూర్తి నాన్నగంటును కాక మధ్యరకముగా ఉంటూ, అమ్మకంటే కొంత తక్కువైన చిన్నమ్మగంటును సంపాదించుకొన్నారు. మీరనుకొన్నట్లు వీరిరువురు నాన్నగంటును సంపాదించుకోలేదు, కావున వారిని జ్ఞానికి అజ్ఞానులకు మధ్యలో నిలబెట్టండి.

(యమభటులు యమధర్మరాజు చెప్పినట్లు వైష్ణవుణ్ణి, శైవుణ్ణి ఇద్దరినీ మధ్యలో నిలబెట్టారు.)

చిత్రగుప్తుడు :- యమా! ప్రకృతి సంబంధమైన (ప్రపంచసంబంధమైన)