పుట:Prabodhanandam Natikalu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధనమును సంపాదించిన వారు అమ్మగంటుకలవారనీ, పరమాత్మ సంబంధ జ్ఞానధనమును సంపాదించినవారు నాన్నగంటుకలవారనీ మాకు తెలియును. కానీ అటు, ఇటు కానీ పిన్నమ్మగంటును సంపాదించినవారనగా, మాకు అర్థముకాలేదు ప్రభూ! నాకే అర్థముకానిది వీరికేమి తెలియును. కావున వీరికీ నాకూ అర్థమగునట్లు, ధర్మములను తెలిసిన మీరే తెలుపమని కోరుచున్నాము.

యముడు :- చిత్రగుప్తా! అమ్మలాంటిదే అమ్మ చెల్లెలే చిన్నమ్మ. అలాగే ప్రకృతిలాంటిదే ప్రకృతి భావములున్నదే మరొక దేవతలభక్తిని చిన్న ప్రకృతి అనుకొనుము. ప్రకృతిని కోకిలగా, దేవతా ప్రకృతిని కాకిగా పోల్చి చెప్పెదము వినుము. ‘కుహూ’ అని అరిచేది నల్లనికోకిల, అలాగే ‘కావు’ అని అరిచేది నల్లనికాకి. కోకిలలాంటిది నల్లనిదే కాకి, కానీ దాని అరుపులో, దీని అరుపులో కొద్దిగ తేడా ఉంటుంది. కోకిల ‘కు’ అంటే కాకి ‘కా’ అంటుంది. ఇంకొక విషయమేమంటే, కోకిల తనగ్రుడ్లను ఎప్పుడు పొదగదు. కాకులు లేనపుడు కాకిగూటిలో కాకిపెట్టిన గ్రుడ్లమద్యలో, కోకిల తన గ్రుడ్డును పెట్టివస్తుంది. కాకి తనగ్రుడ్లతో పాటు తన గ్రుడ్డువలెనున్న కోకిల గ్రుడ్డును గుర్తించలేక దానిని కూడ పొదుగుట వలన, కోకిల పిన్నమ్మ అని కాకికి పేరువచ్చినది. అలాగే ప్రకృతి భావములు కోకిల మాదిరీ, దేవతల భావము కాకి మాదిరీయున్నది. కాకి, కోకిల రెండూ ఎలా నల్లగా ఉన్నవో అలాగే ప్రకృతి భావము, దేవతల భావము రెండు గుణములుగానున్నవి. ప్రపంచములో వచ్చినట్లే, దేవతల ముందర కూడ కోర్కె మొదలగు గుణములన్నియు చెలరేగుచున్నవి. అందువలన ఆధ్యాత్మికము అని పేరు పెట్టుకొని, ఆదికర్త అయిన దేవున్ని వదలి, కోకిల ప్రకృతిలోయుండి, కాకి దేవతలను ఆరాధించు వారిని చిన్నమ్మగంటువారని చెప్పవలసివచ్చినది.