పుట:Prabodha Tarangalul.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

381. శరీరములోని ఐదు జ్ఞానేంద్రియముల వలన సంభవించునది కర్మ కాగా, కర్మ మూడు విధములుగ గలదు.

382. ప్రారబ్ధ, ఆగామి, సంచితములనబడు మూడు కర్మలలో ప్రారబ్ధము ఈ జన్మలో పుట్టినప్పటి నుండి చనిపోవువరకు జరుగునది.

383. ఆగామికర్మ అనగా పుట్టినప్పటి నుండి చనిపోవువరకు క్రొత్తగ వచ్చునది.

384. జీవితములో సాధారణ మనిషి చేయుచున్న పనిలో ప్రారబ్ధము ఆగామికము రెండు గలవు. ఎలాగంటే ప్రారబ్ధము అయిపోవుచున్నది. ఆగామికము తయారగుచున్నది.

385. జన్మ జన్మలకు అనుభవించగా మిగులుచు వస్తూ కుప్పలాగా పేరుకుపోవుచున్నది సంచితము.

386. శాస్త్రములు ఆరు, పురాణములు పదునెనిమిది కాగ అజ్ఞానులు భక్తిమార్గమున ప్రవేశించుటకుపయోగపడునవి పురాణములు, జ్ఞానులు మోక్షమార్గమున ప్రవేశించుటకుపయోగపడునవి శాస్త్రములు.

387. పదునెనిమిది పురాణములలో భక్తికి భాగవతము ముఖ్యము కాగా, ఆరు శాస్త్రములలో దైవజ్ఞానమునకు ముఖ్యమైనది యోగశాస్త్రము.

388. నూటికి నూరుపాల్లు యోగశాస్త్రమైనది భగవంతుడు చెప్పిన భగవద్గీతయే.