పుట:Prabodha Tarangalul.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

374. ద్రవ్యయజ్ఞములో నాలుగు రకములైన ద్రవ్యములు కాలిపోవుచుండగ వాటిని కాల్చునది జఠరాగ్ని. అలాగే జ్ఞానయజ్ఞములో ఐదు రకములైన ఇంద్రియ జ్ఞానములు కాలిపోవుచున్నవి. వాటిని కాల్చు అగ్ని జ్ఞానాగ్ని.

375. శరీరములో జరుగు రెండురకముల యజ్ఞములలో ద్రవ్యయజ్ఞము ఆత్మకు సంబంధించినది. జ్ఞానయజ్ఞము జీవాత్మకు సంబంధించినది.

376. ద్రవ్యయజ్ఞము ఆత్మకుపయోగపడునది కావున ఆత్మ ద్రవ్యయజ్ఞ మును సక్రమముగ నెరవేర్చుచున్నది.

377. జ్ఞానయజ్ఞము జీవునకుపయోగపడునది కావున జీవాత్మ జ్ఞానయజ్ఞము చేయవలెను. కాని జీవాత్మ జ్ఞానయజ్ఞము చేయడము లేదు.

378. ద్రవ్యయజ్ఞము ప్రతి జీవరాసియందు జరుగుచుండగ, జ్ఞాన యజ్ఞమును కోటికొక్కడు కూడ చేయడము అరుదుగా ఉన్నది.

379. జ్ఞానులు, స్వాములు, పీఠాధిపతులు, లోపలి జ్ఞానయజ్ఞమును గురించి తెలియక, బయటి అగ్నితో పుల్లలను కాల్చు యజ్ఞములు చేయుచున్నారు.

380. ద్రవ్యయజ్ఞము ద్వార సంప్రాప్తమగునది పాప పుణ్యములనబడు కర్మకాగా, జ్ఞానయజ్ఞము ద్వార సంప్రాప్తమగునది పరమపదమనబడు మోక్షము.