పుట:Prabhutvamu.pdf/90

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసననిర్వహణస్వరూపము

89

కోస్తాలో ఎన్నివిధముల ఉత్తరువులు వేయడానికి అధికారులకు అవకాశములున్నవో వ్రాయబోయిన గ్రంథమగును. సర్కారువారు ప్రతి సంవత్సరమును శాసనసభ యెదుట పెట్టే బడ్జెట్టు తీసికొంటే వారు అడిగే వ్యయముల శాంక్షనులు 37 వర్గములక్రింద ఏర్పరచినారు. ఈవర్గాలపేళ్లు క్రింద ఉదాహరించడ మయినది. [1]ఇందులో ఒక్క రివిన్యూ తీసికొంటే అందులో అంతర్భాగాలు రివిన్యూ శెక్రటేరియట్ , రివిన్యూబోర్డు, జిల్లాసిబ్బందీ, సర్వేసెటల్మెంటు రికార్డుఅఫ్ రైటులు, ఇందులో ఒక్క సర్వేమాటే తీసుకొన్నా కేంద్ర సర్వేఆఫీసు, సర్వేపార్టీలు, ఎస్టేటుసర్వేలు, మునిసిపల్ యూనియన్ సర్వేలు ఇన్ని కలవు. ఇన్నిటికి ఒక్కొక్క శాఖమీద ఒక్కొక్క అధి

  1. 1. ల్యాండు రెవిన్యూ, , 2. ఎక్సైసు, 3 స్టాంపులు , 4. ఫారెస్టు, 5. రిజిస్ట్రేషను, 6. మోటారుపన్ను, 7 ఇర్రిగేషను, 8. రాజధానిలో సిబ్బంది, 9. శాసనసభలు, 10 జిల్లాపరిపాలనవగైరా, 11. న్యాయవిచారణ, 12. జెయిళ్లు, 13 పోలీసు, 14 ఎలెక్ట్రిసిటీ, 15. విద్య, 16. వైద్యము, 17 ప్రజారోగ్యము, 18 వ్యవసాయము , 19 పశుచికిత్స, 20 సహకారము(కోఆపరేషన్), 21 పరిశ్రమలు, 22 చేపలు, 23 చిల్లరడిపార్టుమెంటులు, 24 కట్టడములు (సివిలు వర్క్సు), 25 సివిలువర్క్సు (సిబ్బందిన గైరా), 26 సివిలువర్క్సు (సహాయగ్రాంటులు), 27 క్షామము, 28 పెన్‌షనులు , 29 స్టేషనరీ ప్రింటింగు, 30 చిల్లర, 31 ఇర్రిగేషను మీద పెట్టుబడి, 32 పరిశ్రమలమీద పెట్టుపడి, 33 ఎలెక్ట్రిక్కు స్కీములమీద పెట్టుబడి, 34 సివిలువర్క్సుమీద పెట్టుబడి, 35 పెన్‌షన్‌ల పెట్టుబడి మదింపు (కమ్యుటేషన్ ).