పుట:Prabhutvamu.pdf/89

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

ప్రభుత్వము

ర్చోడము మంత్రుల ఆత్మగౌరవమునకు భంగమని నిర్ణయించి కాంగ్రెసుమంత్రులు రాజీనామాలివ్వ సిద్ధపడిరి. విషమస్థితికలిగినదని అందరును దిక్కులుచూడ నారంభించిరి. సెలవుతీసికొనిన గవర్నరు సెలవు రద్దుచేసికొని గండముతప్పించెను. పార్లమెంటరీ శెక్రటరీలని శాసనసభ్యులలో కొందరిని మంత్రులకు సహాయకులుగా నేర్పరచినారు. కాని ఇండియారాజ్యాంగశాసనము ప్రకారము జీతములు, బత్తెములు, సెలవులు, పెన్‌షన్‌లు విషయములలోను తుదకు హెచ్చరికచేసేటంత మాత్రపు దండన విషయములందు సహా పరిపూర్ణముగా సంరక్షణపొంది ఇప్పటికిని శెక్రటరీ అఫ్ స్టేటువల్ల నియమితులగుచుండు ఐ. సి. ఎస్ మున్నుగాగలవారు, నిన్నటివరకు రమారమి ముప్పది డిపార్టుమెంటులను నిరంకుశముగా ఏలినవారు, మంత్రులనుకాదనికూడ గవర్నరులదగ్గరికి ప్రత్యేకముగా కాగితములు తీసికొనిపోవుటకు, ఉత్తరువులు చేయించుకొనుటకు ప్రస్తుతపు ఆక్టుక్రిందను అవకాశము కలవారు, గవర్నమెంటు శెక్రటరీలుగా ఉండి రాజ్యాంగశాసనములో పే రేతల పెట్టని పార్ల మెంటరీ శెక్రటరీలకు కాగితములు పంపుట వారి యభిప్రాయములు కనుగొనుట జరుపుదురా? విషమస్థితి యెట్లు ఎప్పుడుకలుగునో చెప్ప వీలులేదు. త్వరలో కలుగకపోవచ్చును. అయినను ఇంత పట్టుదల యేల యుండవలెనను వారుందురు. కారణము ఇంతవరకు చెప్పినదియే. శాసనసభ లెన్ని ఉండనీ మంత్రు లెందరుండనీ అనుదినరాజ్యచర్య జరపడములో చాల యెక్కువ పలుకుబడి, రుచి యున్నవి. మన మద్రాసు