Jump to content

పుట:Prabhutvamu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

ప్రభుత్వము

కారి. నేటిదినము జరిగే రివిన్యూచట్టము అనగా బోర్డు స్టాండింగు ఆర్డరులు 3000 పేజీలు—ఈ రీవిన్యూలో ఉండే పై అధికారులు వ్రాసి అమలు జరుపుతుండేదేకాని వేరులేదు : సర్వేరాతికి పావలా ఏ సందర్భాలలో వసూలుచేయవచ్చును, ఏసందర్భాలలో వసూలు చేయరాదు అనేవిషయముతో ఆరంభించి నంజీనిపుంజీ పుంజీని నంజీగా మార్చేవరకు, గ్రామనౌకరుల సెలవు మొదలుకొని కలెక్టరుల అధికారాలవరకు, నిర్ణయించే సర్వ వ్యవహారము ఈబోర్డు స్టాండింగు ఆర్డరులలో ఇమిడినది. ఇర్రిగేషన్ మాట ఆలోచించినచో దాని బడ్జెట్టు గ్రంధమే వేరేగా ప్రకటించెదరు. దీనినిబట్టి చూడగా 21 లక్షల రూపాయలు సిబ్బందివ్యయము మాత్రమున్నది. ఇర్రిగేషను పనుల మాన్యూలు, నిబంధనలు, ఏశాసనసభవారును వ్రాసినది కాదు. అంతయు అధికారులు సిద్ధపరచునదే. ఒక్క రివిన్యూ ఇలాఖాలో కోస్తా పెత్తనదారులు సుమారు ఇరువదిమంది యున్నారు. ఇర్రిగేషన్ ఇలాకాలో పెత్తనదారులకు లెక్క లేదు. చీఫ్ ఇంజనీరులు, గవర్నమెంటు ఆర్కిటెక్టు, ఎలెక్ట్రికల్ ఇంజనీరు, సూపరింటెండింగు ఇంజనీరులు, ఎక్సెక్యూటివు ఇంజనీరులు వీరు పెట్టినదేభిక్ష. ఇట్లే ఒక్కొక్క డిపార్టుమెంటునుగురించియు, వ్రాసికొని పోవచ్చును. ముఖ్యముగా పరిశ్రమలు, విద్యుచ్ఛక్తి నిర్మాణము, సేవకు, అధికారానికి, శాసనానికి చాల అవకాశమిచ్చునవి మనకోస్తాలో ఉన్నవి. ఇన్నిటిమీద పెత్తనదారులందరిని మంత్రులవశము చేయవలసినదని కాంగ్రెసువారు కోరి