ప్రభుత్వమనగా నేమి?
5
ఈరీతిగా మనదేశములో కుటుంబజీవనము, గ్రామజీవనము అను నీరెండును పరిపూర్ణ మైన వికాసముతో విజృంభించియుండినందుననే, మనదేశ మనాదికాలము నుండి ఉత్తమసామ్రాజ్యముల కునికిపట్టై శ్రీరాముడు, చంద్రగుప్తుడు, అశోకుడు, విక్రమార్కుడు, పృథ్వీరాజు, షర్షా, అక్బరు, శివాజీ, శ్రీకృష్ణదేవరాయలు ఇత్యాది మహాచక్రవర్తులకు నిలయమై లోకమునకు సర్వవిధములగు జ్ఞానమును దానముచేయు మహామాతయై తనరార గల్గినది.
ఇంటికి ఇంటిపెద్దలును, గ్రామమునకు గ్రామపు పెద్దలును ఏయేపనులను నెర వేర్చవలసియున్నారో, నెరవేర్చుచుండినారో అట్టిపనులనే తగినవారు దేశమంతటికిని నెర వేర్చుటయే 'ప్రభుత్వము' అందురు.
దేశములను పాలించు ప్రభుత్వములవారు చేయునట్టి కర్మ లెవ్వియో గమనింతము,
(1) దేశమునకు తగిన భూసైన్యమును, నావికా సైన్యమును, వైమానిక సైన్యమును స్థాపించి ఇతరులు పై బడివచ్చి దేశమును దోచుకొనిపోకుండ కాపాడుట మొదటిపని.
(2) తగిన పోలీసుసిబ్బంది, న్యాయస్థానములు