పుట:Prabhutvamu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసననిర్వహణస్వరూపము

87

లలో ఏడురాష్ట్రములయందు అఖండముగా దిగ్విజయము పొందికూడ ఈదిగ్బంధములకులోబడి మంత్రిత్వము లంగీకరించడములేదని గట్టిగా తిరస్కరించిరి. గవర్నరులు నడమంత్రపు మంత్రుల నేర్పరచుకొని రాజ్యమేలిరి. అది సుసాధ్యముకా లేదు. అప్పుడు కాంగ్రెసు సమాధానముచేసికొని అనుదినపరిపాలనలో గవర్నరులు తమ ప్రత్యేకాధికారములు వినియోగించుట లేదని మాట యిచ్చిరి. కాంగ్రెసు మంత్రివర్గము లేర్పడెను. అటుపిమ్మటను రెండు తరుణములలో తగాయిదా కలిగినది. రాజకీయఖైదీల విడుదల విషయమున మంత్రులు అందరిని విడువవలెనని, వ్యక్తుల కేసులు పరిశీలించి విడువవలెనని గవర్నరులు 'బీహారులోను, సంయుక్తపరగణాలలోను విభేదపడుచుండి హరిపురము కాంగ్రెసునాటికి కుదురక కాంగ్రెసు కార్యనిర్వాహకవర్గమువారితో సంప్రతించి మంత్రులు రాజీనామాలిచ్చిరి. గవర్నరులు ఆరాజీనామా లంగీకరింపక నిలిపి తమకు తగినంత వ్యవధి లేకపోయిన దనుచు అందరు ఖైదీలను విడుదలచేయుట కంగీకరించి మంత్రులు మరల ప్రవేశించుట కవకాశము కలిగించిరి. మరల ఒరిస్సాలో నిటీవల నొక విషమస్థితి కలిగెను. గవర్నరు సెలవుమీద పోనెంచెను. అతనిస్థానమున బ్రిటిషు ప్రభుత్వమువారు అచ్చటనే నౌకరీలోనున్న ఐ.సి.ఎస్ . ఆఫీసరును నియమించిరి. మంత్రులవద్ద నౌకరీచేయు ఉద్యోగి, మరల ఆనౌకరీలోనికి రావలసివచ్చినా రావలసినవాడు, మంత్రులకంటె పై హోదాలో, వారి కార్యాలోచన సభ కధ్యక్షుడుగా, వారికి యజమానిగా, కూ