పుట:Prabhutvamu.pdf/87

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

ప్రభుత్వము

ఉంటుంది. కాని అందులో నాలుగుమూలల చెక్కుబందీ తప్ప ఇంటిప్లానేఉండదు. ప్లానంతా సర్కారువారుచేసే నిబంధనలను అనుసరించి నడవవలసిందని వ్రాసిఉంచుతారు. పై పెచ్చు రాజుగారికి ఆర్డరు ఇన్ కౌన్సిలను ఒక అధికారముంచి ఆద్వారా జరుపవచ్చునంటారు ఆ ఆర్డరు ఇన్ కౌన్సిలు వ్రాసేవారుకూడ ఈనిబంధనలు వ్రాసేవారే. అందుచేత ప్రజలవోటు తెచ్చుకొన్నంతసేపు ఇంగ్లండులో మంత్రివర్గము దేశమునకు తనకు మేలనితోచినది చేయ గలుగుచున్నది.

మనదేశ మింకను మెషీనుయుగములోనికి పూర్తిగా ప్రవేశించలేదు. మహాత్ముడు గాంధిపుణ్యమని మన పరిశ్రమాభివృద్ధికూడ గృహపరిశ్రమలకే ఉన్ముఖమయి యున్నది. అయినను మనకుగల స్వాతంత్ర్యములు చాల తక్కువ. రాష్ట్రములలో అనగా మద్రాసువంటి కోస్తాలలో ప్రభుత్వమునందు మనకు స్వాతంత్ర్య మిచ్చినా మన్నారు. ఏబదియైదేండ్లుగా మనదేశీయమహాసభ అహ రహము పోరాటము పెట్టుకొని 'వందేమాతరము', 'హోమురూలు' వంటి మహోద్యమములు బయలుదేరి తుదకు కడచిన 18 ఏండ్లుగ గాంధిమహాత్ముని నాయకత్వమున అసహోద్యమము, ఉప్పుసత్యా గ్రహము, శాసనతిరస్కారములు, సత్యాహింస లాధారముగా దేశముకై కొని లక్షలుగ ప్రజసామాన్యము జైళ్ళకు నడచి లాఠీదెబ్బలుతిని మహాత్యాగములుచేసిన పిదప ఈవాక్యము వెడలినది. గవర్నరుల ప్రత్యేకాధికారములని దానికిని దిగ్బంధనములు శాసనములో పెట్టినారు. కాంగ్రెసువారు ఎన్నిక