పుట:Prabhutvamu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

ప్రభుత్వము

టిని గవర్నమెంటే భరించినది. పని పూర్తిచేయించవలసిన బాధ్యతగల అధికారి పూర్తిచేయించ లేకపోతే ప్రాణ దండనలు విధించినారు.

ఇంత సంపూర్ణముగా కాకపోయినను ఏకొద్దిభాగమైనా ఇటువంటిపని అన్ని దేశములు చేయవలసినదిగా నున్నది. అమెరికాదేశములో ప్రెసిడెంటు రూజ్విల్టు 'న్యూ డీలు' అని నేడు ప్రసిద్ధమైయుండు నూతనవిధానము ననుసరించి పదులలక్షలకొలది పనిలేనివారికి జీవనము కల్పించినాడు. ఇంకను ప్రయత్నించుచున్నాడు.

ప్రజల కూటికి, నీటికిసంబంధించిన ఉద్యమముల కంటే ఈవిషయములందు దేశదేశానికి కలిగియుండే పోటీచేత దేశసంరక్షణకని ఒక్కొక్క ప్రభుత్వమువారును సృష్టించుచుండేపరిశ్రమ అపారముగానున్నది. ఆకాశవిమాన నిర్మాణము, యుద్ధనావలనిర్మాణము, ఫిరంగుల నిర్మాణము,. మందుగుండ్ల నిర్మాణము, సైనికులకు కావలసిన ఇతర వేయిన్కొక్క వస్తువుల నిర్మాణము, తుదకు వారితిండితీర్థముల సరఫరా ఈభాగమంతయు ప్రతిదేశములోను ప్రభుత్వముద్వారా జరుగకతప్పదు. ప్రభుత్వములు ఈదినము దీనికై పెట్టుచుండేకర్చు మరిదేనికిని పెట్టడములేదు. అందులోను ఈకార్యములో అంతటను కొంతరహస్యముండి తీరవలెను. ఈకార్యసాధనకు ప్రభుత్వాలకు ఏనిమిషమున కానిమిషము దేశద్రవ్యముమీద అధికారముండవలెను. దేశములోని ఫేక్టరీలమీద అధికార ముండవలెను. అందులో పెట్టుబడి పెట్టువారిని బలవంతపెట్టవలసివచ్చును. పనిచేసేవారిని బలవంతపెట్టవలసివచ్చును. ప్రత్తి, అల్యూమినియము