పుట:Prabhutvamu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసననిర్వహణస్వరూపము

85

వంటివస్తువుల ఉత్పత్తి మొదలుకొని. “అవి దేశములో నుండవలెనా? బయటికి పంపవచ్చునా? ఎంత పంపవచ్చును? ఎంత నిలపవలెను?”అనే విషయాలతోకూడా నిర్ణయాలు చేసే అధికారము గవర్నమెంటు నడిపేవారి కుండవలెను. ఇన్నివివరాలకు జవాబుదారివహించి నడుపవలసిన పనివిషయమయి శాసనసభ లెంతవరకని నిర్ణయములుచేయగలవు? 365-దినములును 24-గంటలును కూర్చొనినను ఏశాసనసభయు ఈకార్యభారమంతయును వహింపలేదు. రుష్యాలో స్టాలిను అతనిపార్టీయనుచరులు రమారమి డిక్టేటరులుగానే పనిచేయుచున్నారు. అమెరికాలో ఎన్నికయయిన తరువాత అధ్యక్షునిదే సర్వాధికారము కాబట్టి రూజ్విల్టు నిరంకుశముగానే పనిజరిపినాడు. తుదకు సుప్రీముకోర్టు అతడు తీసికొనినచర్య కొంతశాసనవిరోధమని కూడ తీర్మానించినను లక్ష్యముచేయని యంత చొరవతో ప్రవర్తింపవలసివచ్చినది. తాత్కాలికముగా శాసనములుచేసికొనే అధికారము ప్రజాపరిపాలితరాష్ట్రాలలోకూడ పరిపాలనలోని ఉత్తమాధికారికి ఇచ్చుచున్నారు. ఫ్రాంసులో ఇట్టిఅధికారములులేనిది. పని జరుగదని ప్రధానమంత్రి బ్లుముకోరినాడు. శాసనసభలవారు అవకాశమివ్వ లేదు. అతడు రాజీనామాయిచ్చినాడు. శాసనసభవారు పరిపాలకులకు తగిన స్వతంత్రాధికారము లిచ్చువరకు స్తిమితమగు మంత్రివర్గము లేర్పడవనుటకు ఫ్రాంసుచరిత్రయేసాక్షి. అచ్చట మూడుమాసముల కొక మంత్రివర్గము మారుచున్నది. మొత్తముమీద ఇంగ్లీషువాళ్ళు గడుసు వాళ్లు. వీరు శాసనమువ్రాసి సభవారి అనుమతి పొందినట్లే