Jump to content

పుట:Prabhutvamu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసననిర్వహణస్వరూపము

83

టరులుకానిండు- తీర్చవలసిన ప్రశ్నలుగా నేర్పడినవి. అన్నిచోట్లను సర్వప్రజలది ప్రభుత్వమని యేర్పడుట చేత సర్వప్రజల కూటికి, నీటికి, సౌఖ్యమునకు కావలసిన యెల్లయేర్పాటులు తమవియేయని పరిపాలకులు బాధ్యత వహింపవలసి వచ్చుచున్నది. వ్యవసాయము, పరిశ్రమలతో గూడ స్వాధీనముచేసికొని — పనిచేయువారు ప్రజలే యైనను— ప్రజలలోని యేవ్యక్తియు ఇదినాయాస్తియని యనుటకు వీలులేనట్లు విత్తడము, నాటడము, ధాన్య మమ్మడము, ఇనుము కాయడము, బండ్లకమ్ములుచేయడమువగైరా అన్నిపనులును సర్కారుద్వారానే జరుపుచుండడము ఈదినము రుష్యాలో జరుగుచున్నది. 1932-లో రెండుకోట్లటన్నుల గోధుమ దేశములో పండినది. 1933 లో ఇంకొక 80 లక్షల టన్నులు హెచ్చుచేయవలెనని సంకల్పించినారు. సాధించినారు. ఇనుము కోటి ఇరువదియొకలక్షటన్నులు తయారైనది. కోటి ఏబదిలక్షలు కావలెనన్నారు. చేసినారు. ఇవి ఉదాహరణములు. ఐదేసి సంవత్సరములకు ఒకపర్యాయము ఒక్కొక్కవస్తువును గురించి ప్లాను వేయడము ఉత్పత్తి పెంచుచుపోవడము అచ్చటి గవర్నమెంటుపద్ధతి. దేశాభిమానమని ప్రేరేచి పనివారిచేత పనిచేయించడము వారికర్తవ్యము. నిండుకడుపు పెట్టనీ అరకడుపుపెట్టనీ ఆదేశములో పనిలేని మగవాడుగాని ఆడదిగాని లేదనిపించినారు. ఇంతపని జరుగవలెను కాబట్టి సోమరిపోతులనుగాని, పనికితగిన చదువు, శిక్షణలులేనివారినిగాని దేశములో ఉండనిచ్చుటకు వీలులేదు. అందువలన పుట్టిన ప్రతిశిశువు చదువు, శిక్షణ, పోషణ లన్ని