Jump to content

పుట:Prabhutvamu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

ప్రభుత్వము

చోట శాఖలకెల్ల మంత్రులే అధికారులగుచున్నారు. వారి యుత్తరువుల ననుసరించి రాజ్యకార్యములు నడుచుచున్నవి. అధ్యక్షకపద్ధతికలచోట అధ్యక్షుడు శాఖాధికారులను నియమించుట కలదు. వారు అతని యుత్తరువుమేరకు ప్రవర్తింపవలసి యుందురు.

పరిపాలనయే నేడు ముఖ్యతనుము

నేటిరాజ్యములలో ఆర్థికదృష్టితప్ప ఇతరదృష్టులన్నియు నశించినవని చెప్పవచ్చును. 'నారాజ్య మేమేమి యుత్పత్తిచేయుచున్నది? ఎంతెంత? నాప్రజలలో ఎందరకు పనిలేదు? వీరికి పనికల్పించుట యెట్లు? నాదేశపు ఎగుమతులెంత? దిగుమతులెంత? ఎగుమతు లెక్కువయగుచున్నవా? దిగుమతులెక్కువయగుచున్నవా? వ్యవసాయము, పరిశ్రమలు, వ్యాపారము ఇందులో నా దేశము ఇతరదేశములతో తులతూగుచున్న దా? తగ్గిపోవుచున్నదా? ఇతర దేశములు ఇందులో నన్ను వెనుకకునెట్టకుండ నుండవలెనన్న నేనెన్నియెన్ని ఉపాయములు చేయవలెను? దిగుమతుల నరికట్టవలెనా? ఎగుమతుల నరికట్టవలెనా ? సుంకములు పెంచవలెనా? సైన్యములు పెంచుకొన వలెనా? నావికాబలము పెంచుకొనవలెనా? ఆకాశవిమానబలము పెంచుకొనవలెనా? చేతికిచిక్కిన ప్రాంతము లాక్రమించుకొని ముడిసరకులు- వ్యవసాయముచేత తయారగునవి, ఖనిజములు - సరఫరాచేసుకొనవలెనా? నా దేశము తయారుచేసినవస్తువులకు వానిని విక్రయాంగణము చేసికొనవలెనా?” ఇట్టివియే నేడు ప్రతిరాష్ట్రములోను రాష్ట్రకార్యనిర్వాహకులు — అధ్యక్షులు కానిండు, మంత్రులుకానిండు, డిక్టే