పుట:Prabhutvamu.pdf/82

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసననిర్వహణస్వరూపము

81

స్వీడను ఈరాజ్యములనెల్లను ఈపద్ధతియే నెలకొనినది. నేడు క్రొత్తగా నేర్పడుచుండు రాష్ట్రములలోను ఐరోపాలో నీపద్ధతియే ప్రాబల్యము చెందవచ్చును. దీనిని పార్లమెంటరీ పద్ధతియని వర్ణింతురు.

అమెరికాఖండమునందు 'అధ్యక్షక ' పద్ధతి యెక్కువ వాడుకలోనున్నది. దీనిని డెమొక్రాటికు పద్ధతియన్నారు. దీనికంటెను మంత్రివర్గపద్ధతియే ప్రజాధికారానుకూలమని అమెరికారాజనీతి వేత్తలుగూడ నంగీకరింప నారంభించినారు. ఈపద్ధతియే మనదేశమునను నెన్నటికైనను నెలకొననున్నది. ఇప్పటికి మంత్రులు కోస్త్రాలలో నేర్పడి రాజ్యమేలుచున్నారు. ఇండియారాజ్యాంగ శాసనములో నేమివ్రాసియున్నను, కాంగ్రెసువారి అపార దేశభక్తి త్యాగములు కారణముగా, మంత్రులు నడుపునట్టి అనుదినపరిపాలన కార్యక్రమమునందు గవర్నరులు తమ ప్రత్యేకాధికారములు వినియోగించికాని యితరవిధములనుగాని అడ్డమురామని యంగీకరించి అట్లే నడచుకొనుచున్నారు. ఆచారబలము శాసనబలమును రద్దుపరచునను సిద్ధాంతముతో పనులు జరుగుచున్నవి.

మంత్రిగానిండు, అధ్యక్షుడుగానిండు, డిక్టేటరుగానిండు, ఎవ్వరైనను ఉత్తమాధికారిగా నేర్పడువాడు చేయవలసిన పని యనంతమనుట ఇదివరలో సూచితమైనది. కాబట్టి ఆయుత్తమాధికారి తనపనిని శాఖలక్రింద విభాగించి ఒక్కొకశాఖకును నొక్కొకయధికారిని ప్రత్యేకముగా నియమించుచున్నాడు. అతని ననుసరించి క్రింది యధికారులెల్లరును పనిచేయవలసియుందురు. మంత్రివర్గపద్ధతి కల