పుట:Prabhutvamu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

ప్రభుత్వము

మాటికి - సంవత్సరములోపుగ ననియే చెప్పవచ్చును. — మారుచుండట కలదు, అదియే పరాసుభూమిలోని మంత్రివర్గపు బలహీనతకు ముఖ్యకారణము.

ఇటలీలోను పరాసుభూమిలోని స్థితిగతులే చాలకాలము కానవచ్చినవి. అసంఖ్యాకములగు కక్షలుండినవి. ఈకక్షలైనను పరాసుభూమిలోవలే తమ విభేదములు పోగొట్టుకొని తాత్కాలికముగానై నను నేకమగు మార్గమును కానరాదు, ఎవ్వరికి వారు నిర్ధారించుకొని పనిచేయుట ఆ దేశమునందు ఆచారమైయుండినది. అందుచేత అచ్చట మంత్రు లేకీభవించి యొకవర్గముక్రింద నేర్పడుటే కష్టముగా నుండినది. ఒక్కొక్కరికి పొత్తుపొసగక యుండుటను బట్టి వీరి నేకముఖమునకు దెచ్చుకొను పని రాజుదే యయిపోయి అతనికి మంత్రులమీద నెక్కున పలుకుబడి యుండుచు వచ్చినది. మంత్రులను నియమించుట యందును అతని కెక్కువ యధికారమే కలిగినది. ప్రపంచ యుద్ధానంతర మిటలీలో ప్రాతరాజకీయనాయకుల యలసత ప్రజలకు విసుగుపుట్టించినది. సీన్యియరు ముస్సోలినీ ముఖ్యమంత్రియైనాడు. దేశసౌభాగ్యమును దీర్చుటకు గట్టిగా పనిచేయ నెంచినాడు. ఇదివరలో సంక్షేపముగా వర్ణితమైన ఫేసిస్టువిధానము నమలులో పెట్టినాడు. ఇటలీరాజు కార్యదక్షుడగు నీ మంత్రికి ప్రోత్సాహకుడుగ నున్నాడు. మొన్న హిట్లరుకు స్వాగతమిచ్చి నప్పుడు ముస్సోలినీకి అగ్రమున రాజేయుండుట గమనింపదగినది.

మంత్రివర్గముపద్ధతి ఐరోపాఖండమునం దెక్కువ ప్రచారముననున్నది. బెల్జియము, హాలండు, నార్వే,