శాసననిర్వహణస్వరూపము
79
గాని లేకపోవుటచేత 'మంత్రివర్గము' లకు కొంతకు కొంత దీర్ఘాయువు సమకూరుటకలదు. ఇంగ్లీషువారికి వివేచనశక్తి మెండు. యుద్ధము సంప్రాప్తమయినప్పుడేమి, మహాప్రళయమువలె ఆర్ధిక దైన్యము లోకమును ముంచివేయుచున్ననాడేమి ఇంగ్లీషువారు ఉన్న కక్షలనుజంపుకొని సర్వ శక్తలను కేంద్రీకరించిపనిచేయు నభ్యాసముచేసినారు. ఆ కారణముచేత దేశ కార్యములు దీక్షతో జరుగుటకు అవకాశముదొరకి 'మంత్రివర్గము' యొక్క బలము స్థిరపడుటకు వీలైనది. పరాసుభూమిలో నిట్టిపరిస్థితి దొరకినది కాదు. అచ్చటను 'మంత్రివర్గ ' పద్ధతి పూర్ణముగా నెలకొనియున్నది. 'మంత్రివర్గ' పు టనుమతిలేనిది అధ్యక్షు డేమియు చేయుటకు రాదు. ప్రజలవిశ్వాస మున్నంత కాలము 'మంత్రివర్గము' నిలుచును. వారి విశ్వాసము లేనప్పుడు వారు రాజీనామాఇచ్చి తీరవలసియున్నారు. అన్ని కట్టుదిట్టములును ఆంగ్లభూమీలో వలెనే ప్రచారమందున్నవి. కాని 'మంత్రివర్గము' పరాసుభూమిలో ఆంగ్లభూమిలోవలె అంత బలవత్తమము కాలేదు. కారణ మేమందురా, పరాసుభూమిలో కక్షులు ఎక్కువ. ఒక్క కక్షి,కైనను నిశ్చయమగు పలుకుబడిలేదు. నేడీ కక్షిలోనివాడు రే పింకొకకక్షి, ఎల్లుండి మరియొకకక్షి. మూడవనాడు నాల్గవకక్షి, ఇట్లగుటనుచేసి మంత్రివర్గములోనే యొకకక్షివా రుండుటలేదు. ఏవో సమాధానములుచేసికొని పలువిధముల యభిప్రాయములవా రొకసమూహముగా చేరి పనిచేయుచుందురు. ఈవిధమగు నైక్యము బహుకాలము పొసగదు. కాబట్టి మంత్రివర్గము మాటికి