58
ప్రభుత్వము
ప్రభుత్వము క్రింద తటస్థించిన దిదియే. ఒక్కనికి బదులు పెక్కురు, ఒక్క స్థానముననుండిగాక దేశమంతటిని నావరించి, గ్రామగ్రామమందును తమయంశమును నిలిపి నిరంకుశత్వమును వహించుటనుజేసి ప్రజాపరిపాలితరాష్ట్రములలో నెయ్యది యనుకూలపరిస్థితియో అయ్యదియే యిచ్చట ప్రతికూలపరిస్థితియై దానికి లోబడిన ప్రభుత్వపద్ధతి మంత్రివరుడైన మాంటెగ్యూచే ప్రళయమునకు పూర్వపు నాటిపద్ధతియనియు, మానవరసవిహీనపద్ధతి యనియు వర్ణితము కావలసివచ్చినది. ప్రజాప్రభుత్వము నెలకొనుకొలదిని 'సివిలుసర్విసు' ఇతర దేశములందువలెనే మనదేశము నందును ప్రజలసేవకు సహజోపకరణమగునుగాక యని నమ్మనగును. కాంగ్రెసు మంత్రివర్గముల పరిపాలన యారంభమయినపిదప ఇందు కొంతనిజ మున్నదనుట స్పష్టమయినది. సివిలుసర్విసులవారు తాము లాతీదెబ్బలు కొట్టించిన వారికిగూడ భక్తులుగా పనిచేయుచున్నారు.
అతీత ధర్మములు :
అధికారవర్గము శాసననిర్మాణాధికారులచే నియమితమైన కార్యజాలమును నడుపునట్టి ప్రతినిధివర్గము మాత్రమైయుండినయెడల అథికారశాఖాప్రాబల్యము ప్రభుత్వమున నెక్కువగా నుండియుండదు. అధికారశాఖకు "శాసననిర్వహణము” ముఖ్యధర్మమైనను దాని కతీతమైన ధర్మములను కొన్నిటి నీశాఖ వహించుచున్నది. రమారమి యెల్ల నాగరికరాష్ట్రములలోను ఇట్టిశాసనము అవసరమని, శాసనముల నుపక్రమించునట్టి స్వాతంత్ర్యము సర్వసామాన్యముగా అధికారవర్గమునకే చెంది