శాసననిర్వహణస్వరూపము
57
క్కటియు పట్టణాధికారులు, గ్రామాధికారులు మున్నగు నెల్లనౌకరులను మార్చుచుండిరేని పరిపాలన ఎట్లు జరిగి యుండునో చదువరులే యోచించుకొన గలరు. కాబట్టి 'సివిలుసర్విసు'ల పద్ధతి. దీనినే ఆంధ్రమున "పౌరసేవోద్యోగపద్ధతి”యని వ్యవహరించుట కలదు– ప్రజాపరిపాలితరాజ్యములలో స్థిరపడి యున్నది.
అయిన నీ 'పౌరసేవోద్యోగ' పద్ధతి ప్రజాస్వామ్యము పూర్తిగా లేనిచోటులను, బొత్తుగా లేనిచోటులను అనర్థదాయక మయినదనుటకు సందియములేదు. ప్రజాస్వామ్యము కలచోట పౌరసేవోద్యోగులు నానాడు అధికారమున నుండునట్టి కక్షివారియొక్క ఇష్టము ననుసరించి, అనగా, దేశమున నానాడు ప్రబలియుండు అభిప్రాయప్రాబల్యము ననుసరించి, కార్యములు నడుపవలసిన వారగుచున్నారు. ప్రజాస్వామ్యము లేనప్పుడు ఈ యవసర మేర్పడదు. పౌరసేవోద్యోగులకు స్థానము స్థిరము. క్రింది యుద్యోగస్థుల పరంపరను నియమించువారు తామేయగుట పలుకుబడియు స్థిరము. ఎవ్వరికిని జవాబు చెప్పవలసిన యవసరములేనప్పుడు ఇక వీరి కత్తికి అడ్డమేమున్నది? అందులోను పౌరసేవోద్యోగులు ఒక్క దేశములో రమారమి ఒక్కటే తరగతికి చేరిన జనులలోనుండి నియమితులై ఇంకొక్క దేశమున, దూర దేశమున, అందులోను తమభూమికి అంకితమైనదేశమున అధికారము వహించువారగుదురేని వారి నిరంకుశత్వము ఒక్క రాజు నిరంకుశత్వమునకంటె వేయిమడుంగులు దుస్సహమగు ననుట నిర్వివాదాంశము : మన భారతభూమిలో బ్రిటిషు