2
ప్రభుత్వము
లోని వేరు వేరు జనులకు – అన్నకు దమ్మునికి, అక్కకు చెల్లెలికి, బావకు మరదికి, మామకు అల్లునికి—వివాదములు వచ్చినప్పుడు ఆవివాదములను తీర్చుచున్నాడు. చిన్నపిల్లలింటిలో ఉన్నయెడల వారికి గావలసినచదువు సంధ్యలకు తగిన యేర్పాటులు చేయుచున్నాడు. ఉచితజ్ఞుడగు ఉపాధ్యాయునో లేకున్న సరియైన విద్యాలయమునో వెదకికొని లేదా స్థాపింపించి వారికి విద్యవచ్చునట్లు చేయు చున్నాడు. మరి ఇంటిలోనివారికి భోజనాదికములు నిచ్చుచున్నాడు. గుడ్డల నిచ్చుచున్నాడు. వివాహాదినిత్యజీవన విషయములన్నియు సంపాదించుచున్నాడు. ఇంటిలోనివారలకు ఎవ్వరకై నను ఆరోగ్యముతప్పి రోగములు వచ్చినప్పుడు వారికి తగిన వైద్యసహాయమును సంపాదించు చున్నాడు. ఇల్లు శుభ్రముగా నుంచుటకు ఇంటిలో రాత్రులు దీపములు మొదలైనవి పెట్టుటకు అన్నివిధములైన ఏర్పాటులును చేయుచున్నాడు.
ఇట్టి ఏర్పాటులన్నియును బహుసామాన్యులైన గృహస్థులు చేసికొనుచుండుట ప్రపంచమున ప్రతి దినానుభవముగా నున్నది. మనదేశములో నిన్ననేటి దనుకగూడ ఇంతటి సంపూర్ణమైన ఏర్పాటులో, ఇందులో కొన్ని కొన్నియో, ఒక్కొక్క గ్రామమునకు ఒక్కొక్క తెగకు సంబంధించి నడచివచ్చినవి.
నశించీ నశింపకయుండు గ్రామసంస్థలవై పొక్క పర్యాయము దృష్టిమరల్చి చూడుడు, ఒక్కొక్క గ్రామములోను, కొన్నికొన్ని ప్రాంతములలో, నేటికిని సమష్టి ఆదాయమున్నది. ఆదాయ మిప్పుడు విశేషముగా ఏజాతర