పుట:Prabhutvamu.pdf/5

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభుత్వము

1

ప్రభుత్వమనగా నేమి?

ప్రభుత్వమనునది నిజముగా బ్రహ్మవిద్యగాదు. కవిత్వము, చిత్రలేఖనము, చిత్రలేపనము ఇత్యాదివిద్యలవంటిదై నను గాదు. వీనినన్నిటినిగాని, కొన్నిటినిగాని, ఒక్కటినిగాని సాధించుటకు పూర్వజన్మ వాసన యవసరమందురు. ప్రభుత్వ మనుదానిని సాధించుటకు అంత పూర్వజన్మ వాసనయు నవసరము గాదు.

ఇదియేమిది ? ప్రభుత్వ మనిన ఇంతచులకనగా పలుకుచున్నా రే యని చదువరు లాశ్చర్యపడ వచ్చును. అ ట్లచ్చెరువంద బనిలేదు. కుటుంబములో ఇంటిపెద్ద చేయునట్టిపనిని ప్రభుత్వమనుపని అనుకరించును. అందు వలన అది యంతకష్టసాధ్యము కాదనుచున్నాము.

ఒక్క నిముస మాలోచింతము, ఇంటిపెద్ద చేయునట్టి పనియేమి? ఇంటిలోనికి ఇతరులు దూరి దోచుకొని పోకుండ ఇంటిని కాపాడుకొనుచున్నాడు. ఇంటిలో కుటుంబమునకు కావలసిన భోజనాదివసతులకు తగినసదుపాయములకయి వస్తుసముదాయమును సేకరించుచున్నాడు. కుటుంబము